Breaking News

టర్మ్‌ ఇన్సూరెన్స్‌తో ఆర్థిక భద్రత

Published on Mon, 09/02/2024 - 01:43

మన పరోక్షంలో  మన కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు సమర్థమంతమైన మార్గాల్లో నిస్సందేహంగా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ కూడా ఒకటి. ఇది పూర్తిగా ప్రొటెక్షన్‌పై మాత్రమే ఫోకస్‌ చేసే సరళతరమైన బీమా పథకం. పాలసీదారు మరణించినా కుటుంబ పరిస్థితి తల్లకిందులు కాకుండా ఆర్థికంగా భరోసా అందించే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ను తీసుకునేందుకు పలు కారణాలు ఉన్నాయి. అవేమిటంటే.. 

→ ఆదాయ నష్టం నుంచి రక్షణ: సంపాదించే కుటుంబ పెద్ద కన్నుమూస్తే ఆదాయం నిలి్చపోయి ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం కాకుండా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ కాపాడుతుంది. ఉదాహరణకు నలుగురు సభ్యులున్న కుటుంబంలో ఏకైక సంపాదనపరుడైన పాలసీదారు ఇటు ఇంటిరుణం చెల్లిస్తూ అటు పిల్లల చదువులకూ కడుతున్నారనుకుందాం. దురదృష్టవశాత్తూ ఒకవేళ ఆయన మరణించిన పక్షంలో టర్మ్‌ ఇన్సూరెన్సు పిల్లల చదువు ఖర్చులు, రుణాల చెల్లింపు, జీవనం సాగించడానికి అవసరమయ్యే నిధులను సమకూర్చగలదు. 
→ చౌకైనది: టర్మ్‌ ప్లాన్లతో తక్కువ ప్రీమియంలకే అత్యధిక కవరేజీ లభించగలదు. ముఖ్యంగా యుక్తవయస్సులో ఉన్నప్పుడు తీసుకుంటే రిసు్కలు తక్కువ కాబట్టి కాబట్టి ప్రీమియంలు మరింత తక్కువగా ఉంటాయి. కనుక 20లలో లేదా 30లలో ఉన్నప్పుడు టర్మ్‌ పాలసీని తీసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి. 
→ రుణాలకు కవరేజీ: పాలసీదారు ఏవైనా రుణాలు తీసుకున్నా వాటిని తీర్చేందుకు కూడా టర్మ్‌ ఇన్సూరెన్స్‌తో కవరేజీ లభించగలదు. 
ఎంత కవరేజీ ఉండాలి.. 
→ ఇది మీ ఆర్థిక పరిస్థితులు, మీపై ఆధారపడిన వారి అవసరాలు, లైఫ్‌స్టయిల్, భవిష్యత్‌ లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. బండగుర్తు ఏమిటంటే వార్షిక ఆదాయానికి 10 రెట్లు అధికంగా లైఫ్‌ కవరేజీ ఉండాలి. అదనంగా ద్రవ్యోల్బణం, నిర్దిష్ట ఆర్థిక లక్ష్యాల్లాంటివి కూడా పరిగణనలోకి తీసుకుంటే ఎంత కవరేజీ అవసరమవుతుందనేది ఒక అవగాహనకు రావచ్చు.  
→ చివరగా చెప్పాలంటే.. మీ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాల్సిన అవసరం గురించి అర్థం చేసుకునేందుకు, మీకేదైనా అయితే మీ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవగలిగే వారు ఎవరైనా ఒక అయిదుగురు ఉన్నారేమో ఆలోచించి చూడండి. నా మిత్రులను అడిగితే ఏదో ఒకటో రెండో పేర్లు చెప్పారు. కొందరైతే అదీ లేదు. కాబట్టి ఏదైనా జరిగితే మానసికంగా భరోసానిచ్చేవారు చాలా మందే ఉన్నా ఆర్థికంగా వెన్నంటి ఉండేవారు అంతగా ఉండరనేది ఇది తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో కుటుంబానికి ఆర్థిక భద్రత కలి్పంచడానికి టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ఎంతగానో తోడ్పడగలదు.

సమీర్‌ జోషి, చీఫ్‌ ఏజెన్సీ ఆఫీసర్, బజాజ్‌ అలయంజ్‌ లైఫ్‌  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)