Breaking News

ఊరట: వచ్చే నెల నుంచి కూరగాయల రేట్లు తగ్గుముఖం  

Published on Mon, 08/21/2023 - 09:43

న్యూఢిల్లీ: కొత్త పంటలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో వచ్చే నెల నుంచి కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టొచ్చని కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. అయితే, క్రూడాయిల్‌ రేట్లు పెరుగుతుండటమే ఆందోళనకర అంశంగా మారిందని ఆయన చెప్పారు. జులైలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్టమైన 7.44 శాతం స్థాయికి ఎగిసిన నేపథ్యంలో ప్రభుత్వ అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కూరగాయల రేట్ల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం ఎగియడం తాత్కాలికమేనని, ధరలు వేగంగా దిగి వచ్చే అవకాశం ఉందని అధికారి వివరించారు. వర్షపాతం 6 శాతం తక్కువగా నమోదు కావడం వల్ల ఖరీఫ్‌ సీజన్‌పై పెద్దగా ప్రభావం చూపబోదని ఆయన పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కారణంగా ప్రపంచమంతటా ధరలు పెరిగిపోయాయని, భారత్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదని ఆయన చెప్పారు. అయితే, ధరలను తక్కువ స్థాయిలో ఉంచేందుకు సరళతర వాణిజ్య విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుండటం వల్ల భారత్‌ కాస్త మెరుగైన స్థితిలో ఉందన్నారు. అటు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాల తగ్గింపు యోచనేదీ ప్రభుత్వానికి లేదని అధికారి తెలిపారు. మరోవైపు, క్రూడాయిల్‌ రేట్లు ఇటీవలి కాలంలో పెరుగుతుండటం కాస్త ఆందోళనకర అంశమే అయినప్పటికీ.. చమురు మార్కెటింగ్‌ కంపెనీల కోణంలో ప్రస్తుతానికైతే భరించగలిగే స్థాయిలోనే ఉన్నాయని ఆయన వివరించారు. ముడిచమురు రేట్లు 80-90 డాలర్ల మధ్య వరకూ ఉంటే ఫర్వాలేదని, 90 డాలర్లు దాటితేనే ద్రవ్యోల్బణం, ఇతరత్రా అంశాలపై ప్రభావం పడగలదని పేర్కొన్నారు.  

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)