Breaking News

పీఎస్‌బీలపై నేడు ఆర్థిక శాఖ సమీక్ష

Published on Tue, 06/25/2024 - 06:26

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్‌ల చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు మంగళవారం భేటీ కానున్నారు. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలను లోగడ తీసుకురావడం తెలిసిందే. వీటి కింద ఆయా వర్గాలకు బ్యాంకుల నుంచి రుణసాయం ఏ విధంగా అందుతోందన్న దానిపై భేటీలో సమీక్షించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. పీఎం విశ్వకర్మ, స్టాండప్‌ ఇండియా, పీఎం స్వనిధి, ముద్రా యోజన తదితర పథకాల పురోగతిపై పరిశీలన జరగనుంది. 

ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్‌ జోషి ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. అందరికీ ఆర్థిక సేవల చేరువ విషయంలో ఇతర అంశాలు కూడా చర్చకు రానున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతేడాది సెపె్టంబర్‌లో ప్రధాని ప్రారంభించిన పీఎం విశ్వకర్మ పథకం కింద హస్త కళాకారులు, చేతివృత్తుల వారికి నామమాత్రపు వడ్డీపై రుణ సాయం లభించనుంది. ఐదేళ్ల కాలంలో ఈ పథకం కింద రూ.13,000 కోట్ల సాయం అందించనున్నారు. 30 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని అంచనా. 2016 ఏప్రిల్‌ 5న ప్రారంభించిన స్టాండప్‌ ఇండియా పథకం కింద సొంతంగా సంస్థలను స్థాపించే ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళలకు బ్యాంక్‌ల ద్వారా రుణ సాయం లభించనుంది.   

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)