Breaking News

23 ఏళ్ల గరిష్ఠానికి చేరిన కీలక వడ్డీరేట్లు.. తగ్గింపు ఎప్పుడంటే..

Published on Thu, 03/21/2024 - 09:09

అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ తన ప్రామాణిక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న 5.25-5.50 శాతం వడ్డీరేట్లు 23 ఏళ్ల గరిష్ఠ స్థాయిని చేరాయి. అయినా వీటిని తగ్గించేలా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

వరుసగా అయిదోసారి సమావేశంలోనూ ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లలో మార్పు చేయలేదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని 2 శాతం కంటే తక్కువకు తీసుకువచ్చేలా ఫెడ్‌ చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే వడ్డీరేట్లను మార్చడం లేదంటూ ఫెడ్‌ ఛైర్మన్‌ జెరొమ్‌ పావెల్‌ పలుమార్లు తెలిపారు. ఫిబ్రవరి ద్రవ్యోల్బణం అంచనాల కంటే అధికంగా 3.2 శాతంగా నమోదైంది. ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు అంచనాల్లో అనిశ్చితి కొనసాగుతుండడంతో, ద్రవ్యోల్బణంపై అత్యంత అప్రమత్తతగా ఉంటున్నట్లు ఫెడ్‌ బుధవారం (మన కాలమానం ప్రకారం రాత్రి 11:30 గంటలకు) పేర్కొంది.

ఇదీ చదవండి: పెరుగుతున్న రిటైల్‌ ద్రవ్యోల్బణం.. స్థిరమైన వృద్ధికి అవకాశం

ద్రవ్యోల్బణం స్థిరంగా 2 శాతం దిశగా చలిస్తోందన్న విశ్వాసం వచ్చే వరకు కీలక వడ్డీరేట్లలో మార్పు ఉండదని కమిటీ స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్‌లో రేట్ల కోత వైపునకు ఫెడ్‌ మొగ్గు చూపొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాంతో అమెరికన్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ ర్యాలీ గురువారం ఇండియన్‌ మార్కెట్లలోనూ కొనసాగే అవకాశం ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)