Breaking News

పరిశ్రమలు రయ్‌.. ధరలు షాక్‌!

Published on Wed, 12/13/2023 - 00:57

న్యూఢిల్లీ: భారత స్థూల ఆర్థిక గణాంకాల విషయంలో రెండు కీలక విభాగాలకు సంబంధించి మంగళవారం వెలువడిన గణాంకాలు మిశ్రమ ఫలితాలను అందించాయి. అక్టోబర్‌ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 11.7 శాతం వృద్ధిని (2022 అక్టోబర్‌ గణాంకాలతో పోల్చి) నమోదుచేసుకుంది. గడచిన 16 నెలల్లో ఇంత అధిక స్థాయిలో (2022 జూన్‌లో 12.6 శాతం తర్వాత) పారిశ్రామిక ఉత్పత్తి సూచీ నమోదుకావడం ఇదే తొలిసారి.

కాగా, గత ఏడాది ఇదే నెల్లో (2022 అక్టోబర్‌) ఐఐపీలో అసలు వృద్ధి లేకపోగా 4.1 శాతం క్షీణించడంతో తాజా సమీక్షానెల భారీ వృద్ధి గణాంకాలు కనబడ్డానికి ‘బేస్‌ ఎఫెక్ట్‌’ కారణమన్న విశ్లేషణలూ ఉన్నాయి.  ఇక రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (పీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 5.55 శాతంగా నమోదయ్యింది. గడచిన మూడు నెలల్లో మొదటిసారి ఇంత అధిక స్థాయి రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదయ్యింది.

నిజానికి ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం రిటైల్‌ ద్రవ్యోల్బణం ప్లస్‌ 2 లేదా మైనస్‌ 2తో 4 శాతంగా ఉండాలి. దీని ప్రాతిపదికన ఎగువ దిశలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతం వరకూ ఉండవచ్చు. అయితే ద్రవ్యోల్బణం పట్ల చాలా అప్రమత్తత అవసరమని,  4 శాతం కట్టడే తమ లక్ష్యమని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన ఐఐపీ కీలక విభాగాల గణాంకాల్లో  పరిశీలిస్తే.. 

‘బేస్‌ ఎఫెక్ట్‌’తో జూమ్‌! 
∙భారత్‌ మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) దాదాపు 28.3% వాటా కలిగిన పారిశ్రామిక రంగం ఉత్పత్తి 11.7% పెరిగితే, అందులో దాదాపు 70% వాటా కలిగిన తయారీ రంగం పురోగతి సమీక్షా నెల్లో 10.4%. గత ఏడాది ఇదే నెల్లో ఈ విభాగంలో అసలు వృద్ధి లేకపోగా 5.8 శాతం క్షీణత నమోదయ్యింది.ఏప్రిల్‌–అక్టోబర్‌ మధ్య 6.9 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ఏప్రిల్‌–అక్టోబర్‌ మధ్య ఐఐపీ వృద్ధి రేటు 6.9%గా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో వృద్ధి రేటు 5.3%.  

ఆహార ధరల తీవ్రత 
దిగువబాటలో కొనసాగుతున్న రిటైల్‌ ద్రవ్యోల్బణం (సీపీఐ) నవంబర్‌లో ‘యూ–టర్న్‌’ (సెపె్టంబర్‌లో 5.02 శాతం, అక్టోబర్‌లో 4.87 శాతం) తీసుకుని, 5.55 శాతంగా నమోదయ్యింది.  ఆహార ధరల పెరుగుదల దీనికి కారణం. ఉత్పత్తుల బాస్కెట్‌లో ఒక్క ఫుడ్‌ బాస్కెట్‌ను చూస్తే, 2022 నవంబర్‌లో ద్రవ్యోల్బణం 4.67 శాతం, 2023 అక్టోబర్‌లో 6.61 శాతం ఉంటే, తాజా సమీక్షా నెల నవంబర్‌లో ఇది 8.7 శాతానికి  ఎగసింది.

మొత్తం సీపీఐలో ఫుడ్‌ బాస్కెట్‌ వెయిటేజ్‌ 50 శాతం. ఇందులో రెండంకెల్లో ధరలు పెరిగిన జాబితాలో సుగంధ ద్రవ్యాలు (21.55 శాతం) పప్పు దినుసులు (20.23 శాతం) కూరగాయలు (17.70 శాతం),  పండ్లు (10.95 శాతం), తృణ ధాన్యాలు (10.25 శాతం) ఉన్నాయి. ధరలు పెరిగిన మిగిలిన ఉత్పత్తుల్లో చక్కెర, తీపి ఉత్పత్తులు (6.55 శాతం) గుడ్లు (5.90 శాతం), పాలు, పాల ఉత్పత్తులు (5.75 శాతం), ప్రెపేర్డ్‌ మీల్స్‌ (4.22 శాతం), నాన్‌ ఆల్కాహాలిక్‌ బేవరేజెస్‌ (3.58 శాతం) ఉన్నాయి. ఆయిల్, ఫ్యాట్స్‌ ధరలు మాత్రం 15.03 శాతం తగ్గాయి. ఇక ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ ధరల పెరుగుదల 8.02 శాతంగా ఉంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)