Breaking News

రేపటి నుంచే ఫాస్టాగ్‌ కొత్త రూల్స్‌.. అవి మార్చుకోవాల్సిందే!

Published on Wed, 07/31/2024 - 19:17

వాహనాల ఫాస్టాగ్‌కు సంబంధించిన కొత్త రూల్స్‌ ఆగస్ట్‌ 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం ఫాస్టాగ్‌ యూజర్లు తప్పనిసరిగా కేవైసీ చేయించుకుకోవాలి. లేకుంటే టోల్‌ ప్లాజాల వద్ద చిక్కులు తప్పవు.

నూతన నిబంధనలు ఇవే..
ఆగస్టు 1 నుంచి ఫాస్టాగ్ సేవలను అందించే కంపెనీలు 3-5 సంవత్సరాల క్రితం జారీ చేసిన అన్ని ఫాస్టాగ్‌లకు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇందుకు అక్టోబర్ 31 వరకు గడువు ఉంటుంది. అదే ఐదేళ్లకు పైబడిన ఫాస్టాగ్‌ను తప్పనిసరిగా మార్చాలి. వాహన యజమానులు తమ ఫాస్టాగ్‌ల జారీ తేదీలను పరిశీలించుకుని తక్షణమే మార్చుకోవాలి.

ఆగస్టు 1 నుంచి అన్ని ఫాస్టాగ్‌లను వాహన రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్‌తో అనుసంధానం చేయాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. నూతన వాహన యజమానులు కూడా వాహనాన్ని కొనుగోలు చేసిన 90 రోజుల్లోగా తమ రిజిస్ట్రేషన్ నంబర్‌ను అప్డేట్ చేయాలి. ఫాస్టాగ్ ప్రొవైడర్లు వారి డేటాబేస్‌ను ఖచ్చితమైనదిగా, తాజాగా ఉండేలా చూసుకోవాలి.

ఈ మార్పులతో పాటు వాహనాలను సులభంగా గుర్తించడానికి వాహనానికి సంబంధించిన ముందు, వెనుక వైపుల స్పష్టమైన ఫోటోలను ఫాస్టాగ్‌ ప్రొవైడర్లు అప్‌లోడ్ చేయాలి. కమ్యూనికేషన్, అప్డేట్స్ సజావుగా సాగేందుకు ప్రతి ఫాస్టాగ్‌ను మొబైల్ నంబర్‌కు కనెక్ట్ చేయాలి. కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి చివరి గడువు అక్టోబర్ 31. టోల్‌ప్లాజాల వద్ద ఇబ్బందులు ఎదురవ్వకూడదంటే చివరి నిమిషం వరకు ఉండకుండా ముందుగానే కేవైసీ చేసుకోవడం మంచిది.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)