FASTag: వాహనదారులకు అలర్ట్‌.. ఫాస్ట్‌ట్యాగ్‌పై NHAI కీలక ప్రకటన

Published on Mon, 01/15/2024 - 18:15

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఫాస్ట్‌ట్యాగ్‌లను డీయాక్టివేట్ చేస్తామని ప్రకటించింది. ఫాస్ట్‌ట్యాగ్‌లను డీయాక్టివేట్ చేయడానికి కారణం ఏంటి? ఆలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలు ఇక్కడ చూసేద్దాం..

ఈ నెల చివరి (2024 జనవరి 31) నాటికి ఫాస్ట్‌ట్యాగ్ KYC అసంపూర్తిగా ఉంటే అలాంటి వాటిని డీయాక్టివేట్ చేసే అవకాశం ఉంది. 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్' ప్రచారంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ ప్రకటించింది.

NHAI ప్రకారం KYC జనవరి 31 నాటికి పూర్తి కాకుండా ఫాస్ట్‌ట్యాగ్‌లో బ్యాలెన్స్ ఉన్నా.. అలంటి వాటిని డీయాక్టివేట్ లేదా బ్లాక్ లిస్ట్‌లో పెట్టే అవకాశం ఉంది. సదరు వినియోగదారుడు తమ ఫాస్ట్‌ట్యాగ్‌ డీ యాక్టివేట్ కాకుండా ఉండాలంటే జనవరి 31 లోపల కేవైసీ చేయించుకోవాల్సిందే.

ఫాస్ట్‌ట్యాగ్‌ అనేది వాహనాలకు తప్పనిసరి చేసినప్పటి నుంచి ఇప్పటి వరకులు ఎనిమిది కోట్ల మంది దీనిని వినియోగిస్తున్నారని తెలుస్తోంది. అయితే చాలామంది ఫాస్ట్‌ట్యాగ్‌ వినియోగదారులు వాహనం ముందు భాగంలో కాకుండా ఇష్టానుసారంగా అతికించుకోవడం వల్ల టోల్ ప్లాజాలో ఇతరులకు ఇబ్బందులు కలుగుతున్నాయి గతంలో వెల్లడించారు.

ఇదీ చదవండి: 60 వేలమందికి మొబైల్ నెంబర్ ఇచ్చిన సీఈఓ - ఎందుకంటే?

కొందరు ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌తో పలు వాహనాలను వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వాటిని అరికట్టడానికి 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్' విధానానికి శ్రీకారం చుట్టారు. దీంతో తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్‌ వినియోగదారుడు KYC చేసుకోవాల్సిందే. ఇది మాత్రమే కాకుండా కొందరు కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేస్తున్నారు. ఈ విధానికి కూడా జనవరి 31 తరువాత మంగళం పాడనున్నారు.

#

Tags : 1

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)