50 లక్షల మంది.. రూ.26.55 కోట్లు దాటిన లావాదేవీలు!

Published on Sat, 02/07/2026 - 16:03

2025 ఆగస్టు 15 నుంచి 'ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్ పాస్‌' (FASTag Annual Pass) ప్రారంభమైంది. ఇది అమలులోకి వచ్చిన మొదటి రోజు సాయంత్రం 7:00 గంటల వరకు.. సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్‌ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. టోల్ ప్లాజాలలో దాదాపు 1.39 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి. ఆ తరువాత కూడా ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌కు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఇప్పుడు తాజాగా 50 లక్షల మంది దీనిని కొనుగోలు చేసినట్లు.. ప్రారంభించిన ఆరు నెలల్లోనే 26.55 కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది.

అగ్రస్థానంలో చండీగఢ్
రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) వివరాల ప్రకారం.. ప్రస్తుతం జాతీయ రహదారుల (NH) నెట్‌వర్క్‌లో కార్ల ద్వారా జరిగే మొత్తం లావాదేవీల్లో సుమారు 28 శాతం ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్ పాస్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే, చండీగఢ్ ఈ పాస్ వినియోగంలో అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం వార్షిక పాస్ లావాదేవీల్లో 14 శాతం చండీగఢ్ నుంచే నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో తమిళనాడు (12.3 శాతం) & ఢిల్లీ (11.5 శాతం) ఉన్నాయి.

టోల్ ప్లాజాల విషయానికి వస్తే.. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని బిజ్వాసన్ ఫీ ప్లాజా అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ దాదాపు 57 శాతం కార్ల రాకపోకలు యాన్యువల్ పాస్ ద్వారానే జరుగుతున్నాయి. ముండకా ఫీ ప్లాజా (ఢిల్లీ ఎన్‌సీఆర్) & జిన్‌ఝోలీ ఫీ ప్లాజా (సోనిపట్) వద్ద కూడా సుమారు 53 శాతం నాన్-కమర్షియల్ వాహనాలు ఈ పాస్‌ను ఉపయోగిస్తున్నాయి.

1,150 టోల్ ప్లాజాల్లో.. యాన్యువల్ పాస్‌
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు & ఎక్స్‌ప్రెస్‌వేలలోని సుమారు 1,150 టోల్ ప్లాజాలలో ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్ పాస్‌ను అమలు చేసింది.

వాహనదారులు ఫాస్టాగ్‌లో డబ్బులు అయిపోయిన ప్రతిసారి రీచార్జ్‌ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి రూ.3 వేలు చెల్లించి వార్షిక ఫాస్టాగ్‌ రీచార్జ్‌ చేసుకుంటే 200 ట్రిప్పులు లేదంటే ఏడాది గడువుతో (ఏది ముందు అయితే అది) ఈ పాస్‌ వర్తిస్తుంది. వాహనదారులు కొత్తగా ఫాస్టాగ్‌ కొనాల్సిన అవసరం లేకుండా.. ప్రస్తుతం వాహనంపై అతికించిన ఫాస్టాగ్‌కే ఆ మొత్తాన్ని రీచార్జ్‌ చేసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రాజ్‌మార్గ్‌ యాత్ర యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఇదీ చదవండి: భారత్ - అమెరికా డీల్.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)