Breaking News

‘ఆహార వృధా అంత ఎక్కువేం లేదు’

Published on Sat, 11/22/2025 - 11:54

ప్రజల్లో అనుకుంటున్నట్టు మన దేశంలో ఆహార వృధా అంత ఎక్కువేం లేదని నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేష్‌ చంద్‌ వ్యాఖ్యానించారు. పాలకు సంబంధించి వృధా కేవలం 0.5 శాతమే ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతమున్న ఆహార వృధాలోనూ చాలా వరకు అరికట్టొచ్చని చెబుతూ.. ఇలా చేస్తే అది గోదాముల్లో పెట్టుబడులకు సైతం ప్రోత్సాహకరంగా మారుతుందన్నారు.  

దేశ వ్యవసాయ రంగం వచ్చే పదేళ్ల పాటు 4 శాతం వృద్ధి రేటును సులభంగానే సాధిస్తుందని రమేష్‌ చంద్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. గోదాముల వసతులను పెంచుకోవాల్సి ఉందన్నారు. పీహెచ్‌డీ సీసీఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్‌ ఏటా 2.5 శాతం చొప్పున పెరుగుతున్నట్టు చెప్పారు. కనుక 4 శాతం వృద్ధి సాధ్యమేనన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో (క్యూ1) వ్యవసాయ రంగంలో వృద్ధి 3.7 శాతంగా ఉండడం గమనార్హం.

‘‘కానీ, వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్‌ ఈ స్థాయిలో పెరగడం లేదు. కనుక ఈ ఉత్పత్తులను పరిశ్రమలు వినియోగించాలి. లేదంటే ఎగుమతి చేయాలి. ఎగుమతి మార్కెట్‌ను గుర్తించడం మెరుగైన ఆప్షన్‌ అవుతుంది’’అని రమేష్‌ చంద్‌ పేర్కొన్నారు.

బియ్యం, గోధుమలకు కావాల్సిన నిల్వ వసతుల్లో (గోదాములు) ఎలాంటి వ్యత్యాసం లేదంటూ.. అదే మొక్కజొన్న విషయంలో మాత్రం భిన్నంగా ఉంటుందన్నారు. నిర్ణీత పరిమాణానికి మించి నిల్వ చేయకూడదన్న చట్టం ఉంటే.. అలాంటి నియంత్రణలు గోదాముల నిర్మాణంపై పెట్టుబడులను ప్రభావితం చేస్తాయన్నారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి