Breaking News

నీలకంఠా.. నమోనమామి!

Published on Sun, 02/23/2025 - 04:46

మణుగూరు టౌన్‌: కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన పరమశివుడు నెలవైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని నీలకంఠేశ్వర ఆలయానికి అనేక ప్రత్యేకతలున్నాయి. కాకతీయుల కాలం నాటిదిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో శివుడు ద్విలింగ రూపంలో దర్శనం ఇవ్వడం ప్రత్యేకత. మహాశివరాత్రి, కార్తీక మాసాల్లో వేలాదిగా భక్తులు నీలకంఠేశ్వరుడిని కొలిచేందుకు బారులుతీరతారు. 

దేశంలో రెండో ద్విలింగ దర్శనం
ఆలయానికి వచ్చే భక్తులకు పాతాల లింగేశ్వరుడు స్తూపాకారంలో, నీలకంఠేశ్వరుడు బాణాకారంలో దర్శనమిస్తాడు. భూగర్భంలో భక్తులకు కనిపించేలా పాతాల లింగేశ్వరుడు ఉంటాడు. ఈ లింగాకారం అందరికీ కనిపించినా అర్చకులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. అలాగే పైన నీలకంఠేశ్వరుడు ఉంటాడు. రెండు లింగాలకు రాగి తీగలతో అనుసంధానంగా ఏర్పాట్లు చేశారు. దీంతో పైన ఉన్న నీలకంఠేశ్వరుడికి భక్తులు అభిõÙకం చేయడం ద్వారా.. పాతాళంలోని లింగేశ్వరుడికి కూడా పూజలు చేసినట్లేనని నమ్ముతారు. 

కింద, పైభాగాల్లో ద్విలింగాలు దర్శనమిచ్చే ఆలయాలు దేశంలో రెండే ఉండగా, ఒకటి ఉజ్జయినీ మహంకాళి ఆలయమని, రెండోది మణుగూరులోనే ఉందని చెబుతారు. అంతేకాక రాగి తీగలతో అనుసంధానం చేసి రెండు లింగాలను ఒకటిగా కలిపే ప్రక్రియ దేశంలో మొదటిగా ప్రసిద్ధి చెందింది. ఏటా ఈ ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు పోటెత్తుతారు.

ఎన్నో పురాణ కథనాలు
»   శివాలయం నుంచి కర్ర, ఇనుము, రాయి, నూనె, విభూది తీసుకెళ్లరాదని శాసనాలు చెబుతున్నాయి. అయితే, మొగలాయిల కాలంలో ఓ రాజు దాడులు నిర్వహించి ఆలయాన్ని నామరూపాలు లేకుండా కూల్చివేసి ఆ శిథిలాలతో కోట నిర్మించుకున్నాడట. అనంతరకాలంలో ఆ రాజు కాలగర్భంలో కలిసిపోయాడని చెబుతారు. 
»    భూభాగంలోని పానవట్టంపై స్తూపాకారంలో ఉన్న లింగాన్ని మరోచోట ప్రతిష్టించేందుకు అనేక మంది ప్రయత్నించినా సాధ్యం కాలేదట. అంతేకాక వారు పరమపదించారని ప్రచారంలో ఉంది. 
»    వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు పాతాల లింగేశ్వరుడికి సహస్రఘటాభిõÙకం (వెయ్యి బిందెలతో అభిõÙకం) చేసి స్వామిని జలబంధం చేయడం ద్వారా వర్షాలు కురుస్తాయని భక్తులు నమ్ముతారు.

శివరాత్రికి భక్తుల తాకిడి 
మణుగూరులోని ప్రాచీన నీలకంఠేశ్వరాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. కాకతీయుల కాలంలో స్వయంభూగా వెలిసిన శివుడు కావడంతో ఇక్కడికి భక్తులు శివరాత్రి ఉత్సవాల సమయంలో వేలాదిగా తరలివస్తారు. మనస్ఫూర్తిగా, నియమ నిష్టలతో పూజలు చేస్తే పరమశివుడు కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తులు నమ్ముతారు. 
– పంచాఘ్నల శ్రీరామచంద్రమూర్తి, ఆలయ పూజారి   

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)