Breaking News

అనంత్ అంబానీపై క్రిప్టో ముఠా ఫేక్ న్యూస్

Published on Fri, 05/17/2024 - 14:20

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ తనయుడు, రిలయన్స్‌ సంస్థల్లో డైరెక్టర్‌గా ఉన్న అనంత్‌ అంబానీపై క్రిప్టోముఠా సోషల్‌ మీడియాలో ఫేక్‌ వార్తలు ప్రచారం చేస్తోంది. క్రిప్టో కరెన్సీతో అధిక లాభాలు వస్తాయని అనంత్‌ అంబానీ అంగీకరించినట్లు అమాయకులను మోసగిస్తూ ఆయన పేరును వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది.

వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనంత్ అంబానీ క్రిప్టో కరెన్సీ ఏజెన్సీలను ప్రోత్సహిస్తూ వ్యాఖ్యలు చేసినట్లుగా, ఆయనపై బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసు వేసినట్లుగా బీబీసీ పేరుతో క్లిక్‌బైట్‌ హెడ్డింగ్‌లతో క్రిప్టో ముఠా రూపొందించిన తప్పుడు కథనాలు ఇటీవల సోషల్‌ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.

'హ్యూమన్స్ ఆఫ్ బాంబే'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబానీ తన సహాయకుడు "1X ఆల్రెక్స్ ప్లాట్‌ఫారమ్"ని ఉపయోగించి డబ్బు సంపాదించాడని చెప్పినట్లుగా ఓ కథనం పేర్కొంది. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తితో కూడా అంబానీ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేయించారని, అతను వెంటనే లాభం పొందాడని పేర్కొంది. ఇవన్నీ తప్పుడు కథనాలే అని ఆయా వార్తా సంస్థలు ధ్రువీకరించాయి. నెటిజన్లను తప్పుదోవ పట్టించి క్రిప్టో కరెన్సీ ద్వారా మోసగించేందుకే క్రిప్టో ముఠాలు ఇలా చేసినట్లు తెలుస్తోంది.

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)