ఐడీబీఐపై ఫెయిర్‌ఫాక్స్‌ కన్ను

Published on Tue, 03/19/2024 - 04:48

ముంబై: పీఎస్‌యూ.. ఐడీబీఐ బ్యాంక్‌ కొనుగోలుకి కెనడియన్‌ పీఈ దిగ్గజం ఫెయిర్‌ఫ్యాక్స్‌ ఇండియా హోల్డింగ్‌ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం నగదు రూపేణా చెల్లించేందుకు డీల్‌ కుదుర్చుకోవడం ద్వారా బ్యాంకును సొంతం చేసుకునేందుకు ఫెయిర్‌ఫాక్స్‌ అధినేత బిలియనీర్‌ ప్రేమ్‌ వత్సా ఆసక్తి చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వివరాల ప్రకారం కొనుగోలు తదుపరి సైతం బ్యాంక్‌ గుర్తింపును కొనసాగించేందుకు అంగీకారాన్ని తెలపనుంది.

రెండు వారాల క్రితమే ఆర్థిక శాఖకు ఫెయిర్‌ఫాక్స్‌ తాజా ప్రతిపాదనలు చేరాయి. నిజానికి షేర్ల మారి్పడి ద్వారా బ్యాంకు కొనుగోలు ఒప్పందానికి పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నప్పటికీ ప్రభుత్వం ఇందుకు సన్నద్ధంగా లేదు. దీంతో నగదు చెల్లింపును ఫెయిర్‌ఫాక్స్‌ తెరపైకి తీసుకువచి్చంది. కెనడా, భారత్‌ల మధ్య రాజకీయ విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఈ డీల్‌కు ప్రాధాన్యత ఏర్పడినట్లు బ్యాంకింగ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

సీఎస్‌బీ విలీనం
దేశీయంగా సీఎస్‌బీ బ్యాంక్‌కు ఫెయిర్‌ఫాక్స్‌ ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది. ఫలితంగా ఐడీబీఐను సొంతం చేసుకుంటే సీఎస్‌బీ ప్రమోటర్‌గా కొనసాగేందుకు వీలుండదు. బ్యాంకింగ్‌ నిబంధనల ప్రకారం ఒక ఇన్వెస్టర్‌ రెండు బ్యాంకులకు ప్రమోటర్‌గా వ్యవహరించేందుకు అనుమతి లభించదు. వెరసి ఐడీబీఐలో సీఎస్‌బీ బ్యాంకును విలీనం చేయవలసి ఉంటుంది. ఐడీబీఐ బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ. 90,440 కోట్లుకాగా.. సీఎస్‌బీ విలువ రూ. 6,000 కోట్లు మాత్రమే.

కొంతకాలం ఐడీబీఐను విడిగా కొనసాగించాక తదుపరి దశలో సీఎస్‌బీ బ్యాంకులో విలీనం చేసేందుకు గతంలో ఫెయిర్‌ఫాక్స్‌  ప్రతిపాదించింది. అయితే విస్తారిత కార్యకలాపాలు కలిగిన ఐడీబీఐ బ్యాంక్‌ గుర్తింపు రద్దుకు ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో ప్రతిపాదనలను తాజాగా సవరించింది.

ఐడీబీఐ బ్యాంకులో సీఎస్‌బీ విలీనానికి ప్రతిపాదించడం ద్వారా ప్రభుత్వం, ఆర్‌బీఐ నుంచి సమ్మతిని పొందే ప్రయత్నాల్లో ఉంది. వాటా విక్రయానికి ప్రభుత్వం తెరతీశాక ఐడీబీఐ బ్యాంక్‌ షేరు రూ. 60 నుంచి రూ. 84 వరకూ బలపడింది. ఈ నేపథ్యంలో ఐడీబీఐపై కన్నేసిన కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌.. సవరించిన ఆఫర్‌ ద్వారా ఫెయిర్‌ఫాక్స్‌కు చెక్‌ పెడుతుందా లేదా అనేది వేచిచూడవలసి ఉన్నట్లు బ్యాంకింగ్‌ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 

#

Tags : 1

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)