Breaking News

సిగరెట్‌ అక్రమ రవాణా.. చర్యలు తీసుకోవాలన్న ప్రతినిధులు

Published on Fri, 01/26/2024 - 16:09

ప్రభుత్వ ఖజానాకు ఏటా దాదాపు రూ.13,000 కోట్ల ఆదాయం నష్టం వాటిల్లుతున్న సిగరెట్‌ అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రైతు సంఘం ఎఫ్‌ఏఐఎఫ్‌ఏ (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ఫార్మర్‌ అసోసియేషన్‌) గతంలో ప్రభుత్వాన్ని అభ్యర్థించిన విషయం తెలిసిందే. అక్రమ రవాణా ప్రక్రియలో భాగంగా నేరాలు కూడా పెరుగుతున్నట్లు మెమో­రాండంలో పేర్కొన్నారు. 

సిగరెట్‌ స్మగ్లింగ్‌ను అరికట్టడానికి పన్నులను తగ్గించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. గుజ­రాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో వాణిజ్య పంటల సాగులో ఉన్న లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులకు అసోసియేషన్‌ ప్రాతినిధ్యం వహిస్తోంది.

ఇదీ చదవండి: ఓవెన్‌ సైకిళ్లు వచ్చేశాయ్‌.. ఓ లుక్కేయండి..

అక్రమ రవాణాను అరికట్టడానికి పసిడిపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నారన్న వార్తలను అసోసియేషన్‌ ప్రస్తావిస్తూ, ఇదే రకమైన చర్యలు సిగరెట్‌ పరిశ్రమకు సంబంధించి ఉండాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఫోన్ల స్మగ్లింగ్‌ నిరోధానికీ చర్యలు తీసుకుంటున్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఫోన్‌ అక్రమ రవాణా వల్ల కేంద్ర ఖజానాకు సుమారు 3వేలకోట్ల నష్టం వాటిల్లుతుండగా, సిగరెట్‌ అక్రమ రవాణా విషయంలో ఈ మొత్తం సుమారు రూ.13వేలకోట్లు ఉందని అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. ఈమేరకు సిగరెట్‌ అక్రమ రవాణాను అరికట్టేలా బడ్జెట్‌లో చర్యలుంటాయని ఆశిస్తున్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)