Breaking News

ఇల్లు కొంటున్నారా..? ఒక్క క్షణం..!

Published on Sun, 08/18/2024 - 08:53

సొంతిల్లు సామాన్యుడి కల.. కొందరికి అది పరువు మర్యాద.. ఇంకొందరికి తలకు మించిన భారం. ​కొత్తగా ఉద్యోగం వచ్చిన వారు బంధువుల ఇంటికి వెళితే ఇల్లు ఎప్పుడు తీసుకుంటావని అడుగుతారు. పిల్లల​ పెళ్లిల్లు చేసినవారు వెళితే ‘అన్ని బాధ్యతలు అయిపోయాయి కదా ఇల్లు తీసుకోండి’ అంటారు. సరపడా డబ్బు ఉండి సమాజంలో మరింత గౌరవం కోసం ఇల్లు తీసుకునే వారు కొందరైతే.. సమాజానికి భయపడి పక్కవారికి ఎక్కడ లోకువవుతామోనని ఇల్లు కొనేవారు కొందరు. ఇలాంటి వారు తమ ఆర్థిక స్తోమతకు మించి అప్పుచేసి ఇల్లు కొంటారు. అయితే చాలీచాలని జీతాలతో కాలం నెట్టుకొస్తున్నవారు ఇల్లు తీసుకునే ముందు కొన్ని నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • సాధారణంగా ఇల్లు కొనాలనుకునేవారు లోన్‌ తీసుకుంటారు. వచ్చే జీతంలో సగానికిపైగా ఈఎంఐలకు పోతుంది. కాబట్టి, ఇల్లు కొనాలని అనుకున్నప్పుడు ముందుగా ఆర్థిక పరిస్థితిపై స్పష్టత ఉండాలి.

  • ప్రతినెల వచ్చే ఆదాయం ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. అప్పటికే ఏదైనా లోన్లు, ఇతర అవసరాలకు చెల్లించాల్సినవి ఉంటే అందుకు తగిన ప్రణాళిక వేసుకోవాలి. తీరా ఇల్లు తీసుకుని ఈఎంఐలు చెల్లించకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నెలవారీగా రుణాల మొత్తం ఎంతో లెక్క తీయండి. క్రెడిట్‌ కార్డు చెల్లింపులు, ఇతర అప్పులు ఎంతనే వివరాలను తెలుసుకోవాలి.

  • మారుతున్న జీవన శైలిలో భాగంగా భవిష్యత్తులో అవసరాలకు కొంత డబ్బును సమకూర్చుకోవాలి.

  • పిల్లల చదువులు, ఇంటి అవసరాల కోసం నగదు పోగు చేసుకోవాలి.

  • ఉద్యోగం చేస్తూంటే ఏదైనా అనివార్య కారణాలతో జాబ్‌ పోయినా ఈఎంఐలు, ఇంటి ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు నుంచే ప్రణాళిక ప్రకారం డబ్బు కూడబెట్టాలి. అందుకోసం క్రమానుగత పెట్టుబడులను ఎంచుకుంటే మేలు.

  • ఏదైనా అనారోగ్య పరిస్థితి తలెత్తితే కుటుంబ ఇబ్బంది పడకుండా మంచి ఆరోగ్య బీమా తీసుకోవాలి.

ఇదీ చదవండి: కంటెంట్‌ తొలగించకపోతే అరెస్టు తప్పదు!

  • కుటుంబం అంతా మనపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగి మనం చనిపోతే ఈఎంఐలు, అప్పులని ఇతర కుటుంబ సభ్యులను వేధిస్తారు. కాబట్టి మంచి టర్మ్‌ పాలసీ తీసుకోవాలి. మనకు ఏదైనా జరిగితే మొత్తం డబ్బును చెల్లించేలా ఈ పాలసీ ఎంతో ఉపయోగపడుతుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)