Breaking News

ముందుగానే యాపిల్‌ ఇంటెలిజన్స్‌ సూట్‌..?

Published on Tue, 09/24/2024 - 12:24

సమగ్ర యాపిల్‌ ఇంటెలిజన్స్‌ సూట్‌ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రాబోతున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది. ముందుగా మార్చి 2025 వరకు దీన్ని యాపిల్‌ ఉత్పత్తుల్లో తీసుకురావాలని సంస్థ గతంలో అధికారికంగా ప్రకటించింది. కానీ బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం సంస్థ గతంలో అనుకున్న సమయం కంటే ముందుగానే యాపిల్‌ ఇంటెలిజన్స్‌ సూట్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది.

ఐఓఎస్‌ 18 సిరీస్‌లో యాపిల్‌ ఇంటెలిజన్స్‌ ద్వారా ‘సిరి’లో కొన్ని ఫీచర్లను అప్‌డేట్‌ చేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా మార్చి 2025 నాటికి ఐఓఎస్‌ 18.4 వెర్షన్‌లో సమగ్ర యాపిల్‌ ఇంటెలిజన్స్‌ సూట్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. కానీ అంతకుముందే ఈ ఫీచర్లను వినియోగదారులకు అందించనున్నట్లు తెలిసింది. సంస్థ గతంలో ప్రకటించిన విధంగా ఐఓఎస్‌ 18 సిరీస్‌ వర్షన్లను ఎప్పుడు అప్‌డేట్‌ చేస్తారో తెలిపారు.

  • అక్టోబర్ 2024: ఐఓఎస్‌ 18.1 ఏఐ ఫీచర్లు ప్రారంభిస్తారు.

  • డిసెంబర్ 2024: ఐఓఎస్‌ 18.2తో కొన్ని అదనపు ఫీచర్లు ప్రవేశపెడుతారు.

  • జనవరి 2025: ఐఓఎస్‌ 18.3తో ‘సిరి’ని మరింత మెరుగుపరుస్తారు.

  • మార్చి 2025: ఐఓఎస్‌ 18.4తో సమగ్ర యాపిల్‌ ఇంటిలిజెన్స్ సూట్‌ను ప్రవేశపెడుతారు.

బ్లూమ్‌బర్గ్‌ నివేదించిన ప్రకారంగా ముందుగానే యాపిల్‌ ఇంటిలిజెన్స్ సూట్‌ను ఆవిష్కరిస్తే పైన తెలిపిన ఐఓఎస్‌ వర్షన్ల విడుదల తేదీల్లో మార్పులుండే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి: కొత్తగా ఉద్యోగంలో చేరారా..? ఇవి తెలుసుకోండి..

యాపిల్ ఇంటెలిజన్స్ ‘సిరి’లో గణనీయ మార్పులు చేయబోతున్నట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. అందులో ప్రధానంగా సిరి సందర్భోచితంగా వినియోగదారుల అవసరాలు తీర్చనుంది. ఉదాహరణకు మీ స్నేహితుడు మొబైల్‌లో మీకు తన కొత్త చిరునామాను పంపితే ‘ఈ చిరునామాను తన కాంటాక్ట్ కార్డ్‌కు యాడ్‌  చేయమని’ చెబితే సిరి ఆ పని పూర్తి చేస్తుంది. సుదీర్ఘ ఈమెయిళ్లు చదవడం సమయంతో కూడుకున్న వ్యవహారం. సిరి సాయంతో దాని సారాంశాన్ని తెలుసుకోవచ్చు. అందుకు అనుగుణంగా రిప్లై ఇవ్వొచ్చు. వీటితోపాటు మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంస్థ అధికారికంగా ప్రకటించిన తర్వాతే కంపెనీ అందించే ఫీచర్లపై స్పష్టత వస్తుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)