Breaking News

జీతం లేని జాబ్.. స్పందించిన మాజీ ఉద్యోగి: ట్వీట్ వైరల్

Published on Fri, 11/22/2024 - 14:51

జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ జీతమే లేని ఉద్యోగానికి సంబంధించి ఒక వినూత్న ప్రకటన చేశారు. జీతం ఇవ్వకపోగా.. ఉద్యోగి రూ.20 లక్షలు చెల్లించాలని మొదట్లో పేర్కొన్నప్పటికీ.. ఇప్పుడు దానిపై కూడా ఓ క్లారిటీ ఇచ్చేసారు. ఈ జాబ్ గురించి జొమాటో మాజీ కన్స్యూమర్ ఇంజనీరింగ్ హెడ్‌ అర్నవ్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేసారు.

చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉద్యోగానికి ఎంపికైన ఉద్యోగి మొదటి ఏడాది 20 లక్షలు చెల్లించాలని పేర్కొన్నారు. రెండో ఏడాది ఆ ఉద్యోగికి రూ. 50 లక్షలకు తగ్గకుండా వేతనం ఉంటుందని ప్రకటించారు. ఈ ఉద్యోగానికి ఏకంగా 18,000 మంది అప్లై చేసుకున్నారు. ఆ తరువాత గోయల్ స్పందిస్తూ.. రూ.20 లక్షలు చెల్లించడం అనేది కేవలం వడపోత కోసం మాత్రమే అని పేర్కొంటూ.. రూ.20 లక్షలు చెల్లించే స్తోమత ఉన్న అభ్యర్థుల దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

ఈ వినూత్న జాబ్ ఆఫర్ గురించి మాజీ జొమాటో ఉద్యోగి మాట్లాడుతూ.. గోయల్ ఆలోచనను సమర్ధించారు. ఉద్యోగానికి ఎంపికైన ఉద్యోగి.. తాను ఎంబీఏలో చేరి నేర్చుకునేదాని కంటే కూడా ఎక్కువ నేర్చుకుంటాడని అన్నారు. పెయిడ్ ఇంటర్న్‌షిప్ గురించి చాలామంది తెలివి తక్కువగా ఆలోచిస్తారు. జొమాటోలో జాబ్ పొందితే.. ఆ ఆలోచనను వదిలేస్తారు. మీరు మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ / స్ట్రాటజీలో కెరీర్ కోసం చూస్తున్నట్లయితే.. దాని విలువ రూ.20 లక్షల కంటే ఎక్కువే అని 'అర్నవ్ గుప్తా' (Arnav Gupta) పేర్కొన్నారు.

జొమాటో చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జాబ్
జొమాటోలో చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ స్థానంలో నియామకం కాబోయే వ్యక్తి గురుగ్రామ్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న కోరిక, జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే తపన ఉన్నవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిపై అప్లై చేసుకునే వారికి పూర్వానుభవం అవసరం లేదు.

ఇదీ చదవండి: సరైన సమయానికి.. అనువైన ఫీచర్: ఎయిర్ క్వాలిటీ ఇట్టే చెప్పేస్తుంది

ఉద్యోగంలో చేరిన తరువాత జొమాటో, బ్లింకిట్‌, హైపర్‌ ప్యూర్‌, జొమాటోకు ఆధ్వర్యంలోని ఫీడింగ్‌ ఇండియా ఎన్జీఓ సంస్థల వృద్ధి కోసం పని చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. త్వరలోనే ఉద్యోగిని ఎంపిక చేసి గోయల్ అధికారికంగా ప్రకటించనున్నారు.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)