Breaking News

‘ఫేమ్‌’ లేని ఈ–టూవీలర్లు

Published on Tue, 07/04/2023 - 05:12

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ వాహన పరిశ్రమకు భారీ షాక్‌ తగిలింది. ఫేమ్‌–2 సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం కోత విధించడంతో గత నెలలో ఈ–టూ వీలర్ల అమ్మకాలు ఏడాది కనిష్టానికి చేరుకున్నాయి. 2023 జూన్‌లో దేశవ్యాప్తంగా అన్ని బ్రాండ్లవి కలిపి 45,734 యూనిట్లు రోడ్డెక్కాయి. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే ఇది 56.58 శాతం తగ్గుదల. 2022 జూన్‌లో భారత్‌లో 44,381 ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. అయితే క్రితం ఏడాదితో పోలిస్తే గత నెల విక్రయాల్లో 3 శాతం వృద్ధి నమోదైంది. 40 శాతం ఉన్న ఫేమ్‌ సబ్సిడీ కాస్తా 2023 జూన్‌ 1 నుంచి 15 శాతానికి వచ్చి చేరింది. ప్రభుత్వ నిర్ణయంతో తయారీ కంపెనీలు చాలామటుకు ద్విచక్ర వాహనాల ధరలను పెంచడం ప్రస్తుత పరిస్థితికి కారణం. కస్టమర్లు ఏం కోరుకుంటున్నారు అనే విషయంలో మే నెల, జూన్‌ అమ్మకాలు నిదర్శనంగా నిలిచాయి.  

అత్యధికంగా మే నెలలో..
దేశంలో అత్యధికంగా 2023 మే నెలలో 1,05,338 యూనిట్ల ఎలక్ట్రిక్‌ టూ వీలర్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. భారత్‌లో తొలిసారిగా ఈ–టూవీలర్లు ఒక లక్ష యూనిట్ల మార్కును దాటాయి. జూన్‌ నుంచి ఫేమ్‌ సబ్సిడీ తగ్గుతుందన్న వార్తల నేపథ్యం మే నెల అమ్మకాల జోరుకు కారణమైంది. ఈ ఏడాది మార్చితో పోలిస్తే 22.53 శాతం తగ్గి ఏప్రిల్‌లో 66,466 యూనిట్లు నమోదయ్యాయి. దేశంలో తొలుత 2022 ఆగస్ట్‌లో ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు 50,000 యూనిట్ల మార్కును చేరుకున్నాయి. ఆ నెలలో మొత్తం 52,225 యూనిట్లు భారత రోడ్లపై పరుగెత్తాయి. అదే ఏడాది పండుగల సీజన్‌ అయిన అక్టోబర్‌లో ఈ సంఖ్య 77,250 యూనిట్లకు చేరింది. భారత్‌లో 135 కంపెనీలు ఈ–టూ వీలర్ల రంగంలో పోటీపడుతున్నాయి. జూన్‌ మాసంలో టాప్‌–8 కంపెనీల వాటా ఏకంగా 86.66 శాతం ఉంది. వీటిలో ఏడు కంపెనీలు  తిరోగమన వృద్ధి సాధించడం గమనార్హం.

కంపెనీ    మే    జూన్‌    క్షీణత (శాతాల్లో)
ఓలా    28,629    17,552    38.7
టీవీఎస్‌    20,397    7,791    61.8
ఏథర్‌    15,407    4,540    70.5
బజాజ్‌    9,965    2,966    70.2
ఓకినావా    2,907    2,616    10   

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?