Breaking News

రియల్‌ ఎస్టేట్‌లో ఈక్విటీ పెట్టుబడుల జోరు

Published on Sat, 11/23/2024 - 08:08

న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ రంగంలో దేశంలో ప్రస్తుత సంవత్సరం ఈక్విటీ పెట్టుబడులు 49 శాతం పెరిగి 11 బిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చని పరిశ్రమల సమాఖ్య సీఐఐ, రియల్టీ కన్సల్టెంట్‌ సీబీఆర్‌ఈ నివేదిక తెలిపింది. ఆస్తులకు బలమైన డిమాండ్‌ ఈ స్థాయి జోరుకు కారణమని వివరించింది.

‘2023లో ఈక్విటీ పెట్టుబడులు ఈ రంగంలో 7.4 బిలియన్‌ డాలర్లు. ఈక్విటీ మూలధన ప్రవాహం 2024 జనవరి–సెప్టెంబర్‌ మధ్య 8.9 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 46 శాతం వృద్ధిని నమోదు చేసింది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో 2024లో మొత్తం ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ మొదటిసారిగా 10 బిలియన్‌ డాలర్లను అధిగమించి కొత్త రికార్డును నమోదు చేయబోతున్నాయి. నిర్మాణం పూర్తి అయిన ఆఫీస్‌ అసెట్స్‌లో పెట్టుబడుల పునరుద్ధరణ, రెసిడెన్షియల్‌ విభాగంలో స్థలాల కోసం బలమైన డిమాండ్‌తో ప్రస్తుత సంవత్సరం మొత్తం ఈక్విటీ పెట్టుబడులు 10–11 బిలియన్‌ డాలర్ల శ్రేణిలో ఉంటాయి.

2024 జనవరి–సెప్టెంబర్‌ మధ్య పరిశ్రమ అందుకున్న నిధుల్లో విదేశీ ఇన్వెస్టర్ల వాటా 3.1 బిలియన్‌ డాలర్లు ఉంది. ఇందులో ఉత్తర అమెరికా, సింగపూర్‌ ఇన్వెస్టర్లు 85 శాతం సమకూర్చారు. సెబీ యొక్క ఎస్‌ఎం–ఆర్‌ఈఐటీ ఫ్రేమ్‌వర్క్‌తో ద్వితీయ శ్రేణి నగరాల్లో  అధిక నాణ్యత గల చిన్న స్థాయి ఆస్తులు కూడా వ్యూహా త్మక మూలధన విస్తరణకు కొత్త మార్గాలను అందజేస్తాయి’ అని నివేదిక వివరించింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)