Breaking News

క్యూ3లో 25 రియల్‌ ఎస్టేట్‌ డీల్స్‌..

Published on Wed, 10/16/2024 - 06:00

దేశీ రియల్టీ రంగంలో ఈ కేలండర్‌ సంవత్సరం(2024) మూడో త్రైమాసికంలో 25 డీల్స్‌ జరిగినట్లు కన్సల్టింగ్‌ సంస్థ గ్రాంట్‌ థార్న్‌టన్‌ భారత్‌ నివేదిక పేర్కొంది. వీటి విలువ 1.4 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ. 11,760 కోట్లు)గా తెలియజేసింది. ప్రధానంగా డెవలపర్స్‌ చేపట్టిన అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్‌)దే వీటిలో ప్రధాన వాటాగా వెల్లడించింది. ‘రియల్టీ, రీట్స్‌ డీల్‌ ట్రాకర్‌– ఎంఅండ్‌ఏ, పీఈ డీల్‌ ఇన్‌సైట్స్‌’ పేరుతో విడుదల చేసిన నివేదిక వివరాలు చూద్దాం..

కొత్త రికార్డ్‌  రియల్టీ రంగ జోరును కొనసాగిస్తూ ఈ ఏడాది జులై–సెపె్టంబర్‌(క్యూ3)లో ఏకంగా 25 డీల్స్‌ నమోదయ్యాయి. పరిమాణంరీత్యా ఇది సరికొత్త రికార్డుకాగా.. విలువ(రూ. 11,760 కోట్లు)రీత్యా 2023 ఏడాది క్యూ2 తదుపరి గరిష్ట విలువగా నమోదైంది. ప్రధానంగా క్విప్‌ జారీ పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. వీటికి రెసిడెన్షియల్, వాణిజ్య విభాగాలలో పీఈ నిధులు జత కలిశాయి. అంతేకాకుండా రియల్టీ టెక్నాలజీ కంపెనీలలోనూ ఒప్పందాలు కలిసొచ్చాయి.  

డీల్స్‌ తీరిలా 
క్యూ2లో నమోదైన మొత్తం డీల్స్‌లో 5.1 కోట్ల డాలర్ల విలువైన 8 ఒప్పందాలు కొనుగోళ్లు, విలీనం(ఎంఅండ్‌ఏ) విభాగంలో జరిగాయి. ప్రయివేట్‌ ఈక్విటీ(పీఈ), వెంచర్‌ క్యాపిటల్‌(వీసీ) విభాగంలో 40.1 కోట్ల విలువైన 12 డీల్స్‌ నమోదయ్యాయి. అయితే ఏప్రిల్‌–జూన్‌(క్యూ2)లో లభించిన 1.4 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే భారీగా క్షీణించాయి. 

కాగా.. క్యూ3లో 4.9 కోట్ల డాలర్ల విలువైన ఒక ఐపీవోసహా 94 కోట్ల డాలర్ల విలువైన క్విప్‌లు జారీ అయ్యాయి. ఇందుకు క్యాపిటల్‌ మార్కెట్లు బలపడటం సహకరించింది. క్విప్‌లో 94 కోట్ల డాలర్ల విలువైన 4 డీల్స్‌ జరిగాయి. ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ 60.2 కోట్ల డాలర్ల డీల్‌ దీనిలో కలసి ఉంది. ఇవి క్యూ2తో పోలిస్తే ఆరు రెట్లు అధికం.  

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)