Breaking News

ఈ–వ్యాలెట్లలోకి పీఎఫ్‌ సొమ్ము?

Published on Fri, 12/20/2024 - 08:37

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులు తమ పీఎఫ్‌ క్లెయిమ్‌లను త్వరలో ఏటీఎంల నుంచి ఉపసంహరించుకోవచ్చని కార్మిక శాఖ ఇటీవలే ప్రకటించగా.. ఈ–వ్యాలెట్ల నుంచి సైతం ఈ సదుపాయం కల్పించే దిశగా పనిచేస్తున్నట్టు తెలిపింది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి సుమితా దావ్రా దీనిపై స్పందించారు.

‘తమ సొమ్మును ఎంత సులభంగా ఉపసంహరించుకోవచ్చన్న దానిపై సభ్యుల్లో ఆసక్తి నెలకొంది. ఆటో సెటిల్‌మెంట్‌లో క్లెయిమ్‌ మొత్తం సభ్యుల బ్యాంక్‌ ఖాతాల్లోకి వెళుతుంది. దాంతో బ్యాంక్‌ ఏటీఎం నుంచి ఉపసహరించుకోవచ్చు. క్లెయిమ్‌ మొత్తం వ్యాలెట్‌లోకి నేరుగా ఎలా పంపాలన్న విషయమై కొన్ని మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంది. దీనిపై బ్యాంకర్లతో చర్చలు మొదలు పెట్టాం. దీని అమలు విషయమై ప్రణాళిక అవసరం’ అని పర్యాటక సదస్సుకు హాజరైన సందర్భంగా మీడియాకు సుమితా దావ్రా వివరించారు. ఆర్‌బీఐని సంప్రదించి త్వరలోనే తగిన ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి: బీమా పాలసీతో ఆరోగ్యం కొనుక్కోవచ్చు!

ఈపీఎఫ్‌వో సభ్యులు అతి త్వరలోనే తమ భవిష్యనిధి (పీఎఫ్‌) క్లెయిమ్‌ల మొత్తాన్ని ఏటీఎం నుంచి ఉపసంహరించుకునే అవకాశం అందుబాటులోకి రానున్నట్లు ఇప్పటికే ఆ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సభ్యుల ఆన్‌లైన్‌ క్లెయిమ్‌ ఆమోదానికి 7–10 రోజుల సమయం తీసుకుంటోంది. క్లెయిమ్‌ పరిష్కారం తర్వాత ఆ మొత్తాన్ని సభ్యుల బ్యాంక్‌ ఖాతాకు బదిలీ చేస్తున్నారు. ప్రతిపాదిత కొత్త విధానంలో సభ్యులకు ప్రత్యేకమైన కార్డులు అందించనున్నారు. వీటి ద్వారా ఏటీఎం నుంచి క్లెయిమ్‌ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని ఇటీవల ఓ సీనియర్‌ అధికారి తెలిపారు.

Videos

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)