Breaking News

ఈపీఎఫ్‌వోలో కొత్తగా 16 లక్షల మందికి చోటు

Published on Thu, 02/27/2025 - 07:57

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) కిందకు 2024 డిసెంబర్‌లో కొత్తగా 16.05 లక్షల మంది సభ్యులుగా నమోదయ్యారు. 2024 నవంబర్‌ నెల గణాంకాలతో పోల్చి చూస్తే 10 శాతం, 2023 డిసెంబర్‌ గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 2.74 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. నికరంగా చూస్తే 8.47 లక్షల కొత్త చందాదారులు చేరారు. ఇది ఉపాధి అవకాశాల కల్పన పెరుగుదలను సూచిస్తున్నట్టు కార్మిక శాఖ తెలిపింది.

కొత్త సభ్యుల్లో 4.85 లక్షల మంది 18–25 ఏళ్ల వయసులోని వారే కావడం గమనార్హం. నికర కొత్త సభ్యుల్లో 57 శాతం మేర ఈ వయసు నుంచే ఉన్నారు. వీరంతా మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. 15.12 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరారు. 2024 నవంబర్‌ నెలతో పోల్చి చూసినప్పుడు వీరి సంఖ్య 5 శాతం పెరిగింది. కొత్త సభ్యుల్లో 2.22 లక్షల మంది మహిళలు ఉన్నారు. 2023 డిసెంబర్‌ నెలతో పోల్చి చూస్తే మహిళా సభ్యుల చేరికలో 6.34 శాతం వృద్ధి నమోదైంది.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు.. ఎంతంటే..

టాప్‌–5 రాష్ట్రాల నుంచే 60 శాతం 

కొత్త సభ్యుల్లో 60 శాతం మంది టాప్‌ 5 రాష్ట్రాల నుంచే ఉన్నారు. ఒక్క మహారాష్ట్ర నుంచే 21.71 శాతం మంది ఈపీఎఫ్‌లో చేరారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, హర్యానా, ఢిల్లీ, తమిళనాడు, యూపీ, తెలంగాణ ఇలా ఒక్కో రాష్ట్రం నుంచి విడిగా 5 శాతానికి పైనే కొత్త సభ్యులు చేరారు. మానవ వనరుల సరఫరా, కాంట్రాక్టర్లు, సెక్యూరిటీ సేవలు తదితర ఎక్స్‌పర్ట్‌సరీ్వసెస్‌ తరఫున 41 శాతం మంది కొత్తగా ఈపీఎఫ్‌వో కిందకు వచ్చారు.  

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)