Breaking News

ఈపీఎఫ్‌వో భారీ మార్పునకు సన్నద్ధం! 11 ఏ‍ళ్ల తర్వాత..

Published on Thu, 10/30/2025 - 14:32

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) భారీ మార్పునకు సన్నద్ధమవుతోంది. ఈపీఎఫ్, ఈపీఎస్ అర్హత కోసం జీతం పరిమితిని పెంచే ప్రతిపాదనపై చర్చించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వచ్చే డిసెంబర్ లేదా జనవరిలో సమావేశం కానుంది.

ప్రస్తుతం, నెలకు బేసిక్‌ వేతనం రూ .15,000 వరకు (డీఏతో కలిపి) ఉన్న ఉద్యోగులు మాత్రమే తప్పనిసరిగా ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్), ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) పరిధిలోకి వస్తారు. ఈపీఎఫ్‌వో ఇప్పుడు ఈ పరిమితిని రూ .25,000 లకు పెంచాలని యోచిస్తోంది. ఇది 2014 అనంతరం అంటే దాదాపు 11 ఏళ్ల తర్వాత భారీ మార్పు కాబోతోంది.

ఇది అమల్లోకి వస్తే భారతదేశ శ్రామిక శక్తిలో చాలా మంది ఈపీఎఫ్ ఈపీఎస్ ప్రయోజనాలను పొందుతారు. అంటే ఇప్పుడు పదవీ విరమణ, పెన్షన్ భద్రత కోల్పోతున్న లక్షలాది మంది మళ్లీ వాటి పరిధిలోకి వస్తారు.

ప్రస్తుత వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే.. ఉద్యోగి, యాజమాన్యం ఇద్దరూ ఉద్యోగి నెలవారీ బేసిక్‌ జీతంలో 12 శాతం ప్రావిడెంట్ ఫండ్‌కు జమ చేస్తారు. ఇక్కడ యాజమాన్యం వాటా మళ్లీ విభజిస్తారు. 3.67 శాతం ఈపీఎఫ్‌కు వెళుతుంది. 8.33 శాతం ఈపీఎస్‌కు కేటాయిస్తారు.

ఇక నెలవారీ జీతంలో బేసిక్‌ పే రూ .15,000 దాటినవారికి ఈపీఎఫ్ కవరేజీ తప్పనిసరి కాదు. అంటే ఈపీఎఫ్‌ కవరేజీ కావాలంటే తీసుకోవచ్చు. వద్దనుకుంటే విరమించుకోవచ్చు.

ఈపీఎఫ్ఓ ఇప్పటికే దేశవ్యాప్తంగా 7.6 కోట్ల క్రియాశీల సభ్యులతో రూ .26 లక్షల కోట్ల భారీ నిధిని నిర్వహిస్తోంది. ఈ మార్పు ఇప్పటికే ఆలస్యమయ్యాయని, కార్మిక మంత్రిత్వ శాఖ అధికారులు అంటున్నారు. జీతాలతోపాటు ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉన్న నేపథ్యంలో పాత నిబంధనలు నేటి వాస్తవికతకు సరిపోవు. కొత్త పరిమితి అమల్లోకి వస్తే మరింత మంది కార్మికులకు పదవీ విరమణ అనంతర రక్షణను పొందడానికి సహాయపడుతుంది.

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)