Breaking News

రూ.61 కోట్లు రికవరీ చేసిన ఈపీఎఫ్‌ఓ

Published on Fri, 07/12/2024 - 12:18

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ చెల్లించాల్సిన రూ.73 కోట్ల బకాయిలకుగాను రూ.61 కోట్లను రికవరీ చేసినట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) తెలిపింది. మార్చి 2020 నుంచి మే 2021 వరకు ఈపీఎఫ్‌ఓకు చెల్లించాల్సిన ఎంప్లాయర్‌(కంపెనీ) వాటాలో కొంత మొత్తం వసూలైనట్లు పేర్కొంది.

స్పైస్‌జెట్‌ సంస్థ ఉద్యోగుల వేతనాల్లో కట్‌ అవుతున్న ఈపీఎఫ్‌ఓ వాటాలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. మేనేజ్‌మెంట్‌ వాటాను ఈపీఎఫ్‌ఓకు జమ చేయడం లేదని, బకాయిపడిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని సంస్థకు నోటీసులు అందించారు. దాంతో తాజాగా మార్చి 2020 నుంచి మే 2021 వరకు బకాయిపడిన మొత్తం రూ.73 కోట్లలో రూ.61 ​​కోట్లు రికవరీ అయినట్లు ఈపీఎఫ్‌ఓ తెలిపింది. ఆలస్య చెల్లింపునకు సంబంధించిన వడ్డీ, జనవరి 2022 తర్వాత చెల్లించాల్సిన బకాయిలను కూడా అంచనా వేసినట్లు పేర్కొంది.

ఈ సందర్భంగా స్పైస్‌జెట్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ..‘ఈపీఎఫ్‌ సెక్షన్‌ 14బీ, ఇతర నిబంధనల చట్టం 1952 ప్రకారం విచారణ జరుగుతుంది. చట్టంలోని సెక్షన్ 7A కింద మిగిలిన కాలానికి (ఇప్పటి వరకు) ఎంత చెల్లించాలో లెక్కించి దాన్ని రికవరీ చేసే ప్రక్రియ మొదలైంది’ అని చెప్పారు.

ఇదీ చదవండి: అంబానీ చెల్లి.. భర్త చనిపోయినా కోట్ల కంపెనీకి ఛైర్‌పర్సన్‌గా..

ఈపీఎఫ్‌ఓ పరిధిలోని ప్రతి సంస్థ ఎంప్లాయర్‌ వాటాను ఉద్యోగభవిష్య నిధిలో జమ చేయాలి. ప్రతి నెలా 15వ తేదీలోపు ఈపీఎఫ్‌ఓలో తమ రిటర్న్‌లను ఫైల్ చేయాలి. లేదంటే బకాయిపడిన తేదీ నుంచి ఏటా 12% చొప్పున వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది.

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)