Breaking News

ఈపీఎఫ్‌వో రికార్డ్‌.. భారీగా పెరిగిన ఉద్యోగాలు!

Published on Sun, 07/21/2024 - 09:42

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మే నెలలో నికరంగా 19.5 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది. 2018 ఏప్రిల్‌లో మొదటి పేరోల్ డేటా జారీ చేసినప్పటి నుంచి ఇదే అత్యధికం అని కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

గత రికార్డులో అత్యధికంగా 18.9 లక్షల చేరికలు ఏప్రిల్‌లో నమోదయ్యాయి. ఏడాది ప్రాతికదిన చూస్తే ఈ మే నెలలో సభ్యుల నికర చేరికలు 19.6% పెరిగాయి. పెరిగిన ఉపాధి అవకాశాలు, ఉద్యోగుల ప్రయోజనాలపై పెరుగుతున్న అవగాహన, ఈపీఎఫ్‌ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌ల ప్రభావం వంటివి ఇందుగా కారణాలుగా తెలుస్తున్నాయి.

మే నెలలో ఈపీఎఫ్‌వోలో దాదాపు 9,85,000 మంది కొత్త సభ్యులు నమోదు చేసుకున్నారు. ఇది గడిచిన ఏప్రిల్ నెలతో పోల్చితే 11% ఎక్కువ. 2023 మే కంటే 11.5% అధికం. కొత్త నమోదులలో 58% మంది 18-25 ఏళ్ల వారు ఉండటం హర్షణీయం. వ్యవస్థీకృత వర్క్‌ఫోర్స్‌లో చేరిన వ్యక్తులు యువత, ప్రధానంగా తాజా ఉద్యోగార్థులు అని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇక ఈ నెలలో కొత్తగా చేరిన సభ్యులలో దాదాపు 2,48,000 మంది మహిళలు ఉన్నారని డేటా చూపుతోంది. ఇది 2023 మే నెలతో పోలిస్తే 12.2% పెరుగుదలను సూచిస్తుంది. అలాగే ఈ నెలలో మహిళా సభ్యుల నికర చేరిక దాదాపు 369,000 వద్ద ఉంది. ఏడాది ప్రాతిపదికన ఇది 17.24% పెరిగింది.

#

Tags : 1

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు