ఎందుకు మీకు అంత భయం.. విడుదల రజినిని ఆపేసిన పోలీసులు
Breaking News
అందుబాటులోకి ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ లైట్: ప్రయోజనాలివే
Published on Fri, 09/19/2025 - 07:32
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ కొత్తగా ‘పాస్‌బుక్ లైట్’ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సభ్యులు ప్రధాన పోర్టల్‌లో లాగిన్ అయ్యి ఈపీఎఫ్ పాస్‌బుక్ సులభ వెర్షన్‌ను నేరుగా చూసుకోవచ్చు. ఇప్పటి వరకు సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలన్స్, చందాలు, రుణాలు, ఉపసంహరణల లావాదేవీలను చూసుకునేందుకు ప్రత్యేకంగా ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాల్సి వచ్చేది. ఇకపై పాస్‌బుక్ లైట్ నుంచి కూడా ఈ వివరాలు పొందొచ్చు.
పాస్బుక్లైట్తో యూజర్ అనుభవం మెరుగుపడుతుందని.. ఒకే లాగిన్‌తో పాస్‌బుక్ సహా అన్ని రకాల సేలను పొందొచ్చని, దీన్ని ప్రారంభించిన సందర్భంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. పాస్బుక్కు సంబంధించి సమగ్ర వివరాల కోసం సభ్యులు ఇకమీదటా పాస్‌బుక్ ప్రత్యేక పోర్టల్‌పై లాగిన్ అవ్వొచ్చని చెప్పారు. పీఎఫ్ బదిలీకి సంబంధించిన ‘అనెక్యూర్ కే’ను ఆన్లైన్లో పొందే సదుపాయాన్ని సైతం మంత్రి ప్రారంభించారు.
ఒక సంస్థ నుంచి మరో సంస్థకు ఉద్యోగి బదిలీ అయితే, కొత్త సంస్థకు సభ్యుడి పీఎఫ్ ఖాతా బదిలీ అవుతుంది. అప్పుడు అనెక్యూర్ కేని సంబంధిత పీఎఫ్ కార్యాలయం, కొత్త కార్యాలయానికి బదిలీ చేస్తుంది. సభ్యుల అభ్యర్థన మేరకే ప్రస్తుతం అనెక్సూ్యర్ కేని జారీ చేస్తుండగా, ఇకపై ఆన్లైన్లో సులభంగా పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకునేందుకు ఈపీఎఫ్‌వో వీలు కల్పించింది. దీంతో తమ బదిలీ పూర్తయిందా? ఏ స్థాయిలో ఉంది? అన్నది సభ్యులు ఆన్లైన్లో తెలుసుకోవడం సాధ్యపడుతుంది. పీఎఫ్ బ్యాలన్స్, సర్వీస్ కాలం సరిగ్గానే నమోదయ్యాయా? అన్నది సరిచూసుకోవచ్చు.
Tags : 1