Breaking News

యూపీఐ, ఏటీఎంల ద్వారా పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా

Published on Wed, 06/25/2025 - 01:03

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్‌వో చందాదారులకు శుభవార్త. ఏటీఎంలు, యూపీఐ తదితర మాధ్యమాల ద్వారా తమ ఖాతాల నుంచి ఈపీఎఫ్‌ డబ్బును విత్‌డ్రా చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఉద్యోగులు తమ బ్యాంకు ఖాతాలను ఈపీఎఫ్‌కు అనుసంధానించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుపై కార్మిక శాఖ కసరత్తు చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం ఈపీఎఫ్‌లో నిర్దిష్ట నిష్పత్తిలో కొంత భాగాన్ని పక్కన పెట్టి, మిగతా మొత్తాన్ని విత్‌డ్రాయల్‌కు అందుబాటులో ఉంచుతారని పేర్కొన్నాయి.

ఏటీఎం డెబిట్‌ కార్డులు, యూపీఐలాంటి మాధ్యమాల ద్వారా బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చని వివరించాయి. ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌పరమైన సవాళ్లు ఉన్నాయని, వాటిని పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపాయి. ఈపీఎఫ్‌వోకి బ్యాంకింగ్‌ లైసెన్సులు లేనందువల్ల ఈపీఎఫ్‌ ఖాతాల నుంచి నేరుగా ఉపసంహరించుకునేందుకు వీలుండదని సంబంధిత వర్గాలు చెప్పాయి.

మరోవైపు, ఆటో–సెటిల్మెంట్‌ విధానం కింద విత్‌డ్రాయల్‌ పరిమితిని ప్రస్తుతమున్న రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. ఆటో–సెటిల్మెంట్‌ విధానంలో దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల వ్యవధిలోనే క్లెయిమ్‌ విత్‌డ్రాయల్‌ ప్రక్రియంతా ఎలక్ట్రానిక్‌ విధానంలో సెటిల్‌ అవుతుంది. కోవిడ్‌ సమయంలో అవసరార్థులకు ఆర్థికంగా తక్షణ సాయం అందాలనే లక్ష్యంతో దీన్ని ప్రవేశపెట్టారు.

#

Tags : 1

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)