Breaking News

EPFOలో ఐదు కీలక మార్పులు

Published on Sun, 05/18/2025 - 16:27

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈ ఏడాది.. తన చందాదారుల కోసం కొన్ని కీలక మార్పులు చేసింది. ఇవన్నీ ఉద్యోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ కథనంలో ఈపీఎఫ్ఓలో 2025లో జరిగిన ఐదు కీలక మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం.

ప్రొఫైల్ అప్‌డేట్
ఈ ఏడాది ఈపీఎఫ్ఓలో జరిగిన ప్రధానమైన మార్పులలో ప్రొఫైల్ అప్‌డేట్ ఒకటి. ఈ అప్డేట్ ద్వారా.. ప్రొఫైల్ అప్డేట్ చాలా సులభతరమైపోయింది. మీ యూఏఎన్ నెంబర్.. ఆధార్‌తో లింక్ అయి ఉంటే.. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, లింగం, నేషనాలిటీ, వైవాహిక స్థితి, జీవిత భాగస్వామి పేరు, ఉద్యోగం ప్రారంభించిన తేదీ వంటి వివరాలను ఎటువంటి పత్రాలతో అవసరం లేకుండానే అప్డేట్ చేసుకోవచ్చు.

పీఎఫ్ బదిలీ
గతంలో, ఉద్యోగాలు మారినప్పుడు పీఎఫ్ బదిలీ చేయడం.. చాలా సుదీర్ఘమైన ప్రక్రియగా ఉండేది. ఇప్పుడిది.. చాలా సులభమైపోయింది. పీఎఫ్ బదిలీకి పాత లేదా కొత్త యజమాని ఆమోదం అవసరం లేదు. దీంతో పీఎఫ్ డబ్బు కొత్త ఖాతాకు వేగంగా.. సులభంగా బదిలీ అవుతుంది.

జాయింట్ డిక్లరేషన్
జనవరి 16, 2025 నుంచి వర్తించే కొత్త నిబంధనల ప్రకారం.. ఈపీఎఫ్ఓ ​​జాయింట్ డిక్లరేషన్ ప్రక్రియ డిజిటల్‌గా మారింది. మీ యూఏఎన్ ఆధార్‌తో లింక్ అయి ఉంటే.. జాయింట్ డిక్లరేషన్‌ను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయవచ్చు.

పెన్షన్ పేమెంట్స్
ఈపీఎఫ్ఓ జనవరి 1, 2025 నుంచి కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ (CPPS)ను ప్రారంభించింది. దీని కింద ఇప్పుడు పెన్షన్ 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' ప్లాట్‌ఫామ్ ద్వారా నేరుగా ఏదైనా బ్యాంకు ఖాతాకు పంపడం జరుగుతుంది. గతంలో పెన్షన్ చెల్లింపు ఆర్డర్‌లను ఒక ప్రాంతీయ కార్యాలయం నుంచి మరొక ప్రాంతీయ కార్యాలయానికి బదిలీ చేయాల్సి వచ్చింది. దీని వల్ల పెన్షన్ చెల్లింపు ఆలస్యం అయ్యేది. ఇప్పుడు ఈ విధానం పూర్తిగా రద్దు అయింది.

ఇదీ చదవండి: 'అమెరికాలో ఉంటున్న భారతీయులకు హెచ్చరిక'

జీతంపై పెన్షన్ ప్రక్రియ
అధిక జీతంతో పెన్షన్ పొందాలనుకునే ఉద్యోగుల కోసం.. ఈపీఎఫ్ఓ ​​ఇప్పుడు మొత్తం ప్రక్రియను సులభతరం చేసింది. ఇప్పుడు అందరికీ ఒకే విధమైన పద్ధతిని అవలంబించనున్నారు. ఒక ఉద్యోగి జీతం నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువగా ఉండి, దానిపై పెన్షన్ కోరుకుంటే ఈ విధానం ఉపయోగపడుతుంది. దీనితో పాటు, ఈపీఎఫ్ఓ ​​పరిధిలోకి రాని లేదా వారి స్వంత ప్రైవేట్ ట్రస్ట్ పథకాన్ని నిర్వహించని సంస్థలు కూడా ట్రస్ట్ నియమాల ప్రకారం ఈ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది.

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)