Breaking News

పీఎఫ్‌ ఈ-పాస్‌బుక్‌ డౌన్‌లోడ్‌ కావడం లేదా?

Published on Wed, 04/26/2023 - 16:53

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. అనేక మంది ఈపీఎఫ్‌ సభ్యులు ఈ-పాస్‌బుక్‌లను డౌన్‌లోడ్ చేసుకోలేకపోతున్నారు. ఈ-పాస్‌బుక్ పేజీపై క్లిక్ చేసిన చాలా మంది ఈపీఎఫ్‌  సబ్‌స్క్రైబర్‌లకు 404 ఎర్రర్ కనిపిస్తోంది. దీంతో ‘నాట్‌ ఫౌండ్‌’ అని ఒక సందేశం కూడా వస్తోంది.

ఇదీ చదవండి: మాకు కన్నీళ్లు.. వాళ్లకు కోట్ల కొద్దీ బోనస్‌లా? జుకర్‌బర్గ్‌ను నిలదీసిన ఉద్యోగులు

సర్వర్ సమస్య కారణంగా ఈపీఎఫ్‌వో ​​పోర్టల్ ఈ-పాస్‌బుక్ సౌకర్యం వినియోగదారులకు అందుబాటులో లేనట్లు కనిపిస్తోంది. దీంతో విసుగెత్తిపోయిన కొంత మంది సభ్యులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్‌లో సమస్యను హైలైట్ చేస్తూ ఈపీఎఫ్‌వో  ​​హ్యాండిల్‌ను ట్యాగ్ చేశారు. దీనిపై ఈపీఎఫ్‌వో స్పందిస్తూ ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలోనే పరిష్కరిస్తామని పేర్కొంది. కాగా రెండు వారాలుగా  ఈ-పాస్‌బుక్ సౌకర్యం పనిచేయడం లేదని ఖాతాదారులు చెబుతున్నారు. 

పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా తెలుసుకోండి..

ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో ఈ-పాస్‌బుక్‌ సౌకర్యం ప్రస్తుతం అందుబాటులో లేని నేపథ్యంలో వినియోగదారులు UMANG యాప్, ఎస్సెమ్మెస్‌ లేదా మిస్డ్ కాల్ ద్వారా తమ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌ సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కి “EPFOHO UAN” అని SMS పంపడం ద్వారా లేదా 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా సభ్యులు తమ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ని తెలుసుకోవచ్చు.

ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్‌!

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)