Breaking News

ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం.. పెరగనున్న టేక్ హోమ్ శాలరీ

Published on Fri, 06/28/2024 - 17:24

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2013 సెప్టెంబర్ 1తరువాత జాబ్‌లో చేరిన గవర్నమెంట్ ఉద్యోగుల గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ (GIS) కింద డిడక్షన్లలను నిలిపివేయనున్నట్లు (అమౌంట్ కట్ చేయదు) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ 2024 జూన్ 21న దీనికి సంబంధించిన ఒక సర్క్యులర్ జారీ చేసింది.

ఈపీఎఫ్ఓ తీసుకున్న ఈ నిర్ణయం 2013 సెప్టెంబర్ 1 తర్వాత సర్వీస్‌లో చేరిన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. అంతకు ముందు ఉద్యోగంలో చేరిన వారికి పాత నిబంధనలే వర్తిస్తాయి. వీరికి యధావిధిగా గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమౌట్ డిడక్షన్ అవుతుంది. కాబట్టి 2013 సెప్టెంబర్ 1 తరువాత జాబ్‌లో చేరిన ఆయా కేటగిరిలో ఉన్న ఉద్యోగులు వచ్చే నెల నుంచి ఎక్కువ వేతనం పొందనున్నారు.

2013 సెప్టెంబర్ 1 తరువాత ఉద్యోగంలో చేరినవారికి ఇప్పటి వరకు డిడక్షన్ అయిన మొత్తం కూడా రీఫండ్ అవుతుంది. జీఐఎస్ పరిధి నుంచి వీరిని శాశ్వతంగా తొలగించనున్నారు. జీఐఎస్ కింద తగ్గింపులు నిలిపివేయడంతో ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీలు కూడా పెరగనున్నాయి.

జీఐఎస్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే?
గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ (జీఐఎస్) అనేది 1982 జనవరి 1 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ పేరుతో అమల్లోకి వచ్చింది. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారు ప్రమాదాలకు గురైనప్పుడు సామాజిక, ఆర్థిక రక్షణ కల్పించడమే ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)