73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan
Breaking News
ఈపీఎఫ్‌వోలోకి 14.58 లక్షల సభ్యులు
Published on Thu, 05/22/2025 - 06:36
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో 14.58 లక్షల మంది సభ్యులు మార్చిలో నికరంగా చేరారు. వీరిలో సగం మంది (7.54 లక్షల మంది) కొత్త సభ్యులే కావడం గమనార్హం. అంటే మొదటివారి వీరు ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చారు. సంఘటిత రంగంలో పెరిగిన ఉపాధి అవకాశాలను ఇది ప్రతిఫలిస్తోంది. క్రితం ఏడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూస్తే 1 శాతం ఎక్కువ మంది చేరినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త సభ్యుల చేరికతో పోల్చి చూసినా 2 శాతం వృద్ధి కనిపించింది. ఈ మేరకు మార్చి నెల పేరోల్ గణాంకాలు విడుదలయ్యాయి.
→ కొత్త సభ్యుల్లో 4.45 లక్షల మంది 18–25 ఏళ్ల వయసులోని వారే కావడం గమనార్హం. కొత్త సభ్యుల్లో వీరు 59 శాతంగా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెల, గతేడాది మార్చి నెల గణాంకాలతో పోల్చి చూసుకున్నా 4 శాతానికి పైనే వృద్ధి నమోదైంది.
→ కొత్త సభ్యుల్లో 2.08 మంది మహిళలు ఉన్నారు. గతేడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 4.18 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరితో పోల్చి చూసుకుంటే 0.18 శాతం వృద్ధి నమోదైంది. మార్చిలో నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 2.92 లక్షలుగా ఉంది.
→ 13.23 లక్షల మంది ఒక సంస్థలో ఉద్యోగం మానేసి, మరో సంస్థలో చేరి తమ ఈపీఎఫ్ ఖాతాను ఆన్‌లైన్‌లో బదిలీ చేసుకున్నారు.
→ మార్చి నెలలో నికర సభ్యుల చేరికలో అత్యధికంగా 20.24 శాతం మంది మహారాష్ట్ర నుంచి ఉన్నారు.
→ తమిళనాడు, కర్ణాటక, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, యూపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి సభ్యులు చేరిక విడిగా 5 శాతానికి పైనే నమోదైంది.
Tags : 1