Breaking News

వేతన జీవులకు గుడ్‌న్యూస్‌: ఈపీఎఫ్‌ వడ్డీని పెంచిన కేంద్రం

Published on Mon, 07/24/2023 - 18:09

వేతన జీవులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. 2023 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్‌ వడ్డీ రేటును 8.15 శాతంగా కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫై చేసింది. ఈ మేరకు 8.15 శాతం వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లుగా ఈపీఎఫ్‌ఓ ఓ సర్క్యలర్‌ విడుదల చేసింది. 

ఈపీఎఫ్‌ పథకం- 1952లోని 60 (1) పేరా కింద ప్రతి సభ్యుని ఖాతాలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ వడ్డీని జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదాన్ని తెలియజేసిందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ తెలియజేసినట్లు ఈపీఎఫ్‌ఓ సర్క్యులర్‌లో పేర్కొంది. దీని ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో చందాదారుల పీఎఫ్‌ ఖాతాల్లో జమ చేసిన పీఎఫ్‌ మొత్తానికి 8.15 శాతం వడ్డీని ఈపీఎఫ్‌ఓ సభ్యుల  ఖాతాల్లో జమ చేస్తుంది. ఇంతకు ముందు 2021-22 ఆర్థిక సంవత్సరానికి 8.10 శాతం చొప్పున వడ్డీని ఈపీఎఫ్‌ఓ జమ చేసింది.

కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నేతృత్వంలోని ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌ 23 ఆర్థిక సంవత్సరానికికి గానూ 8.15 శాతం వడ్డీ రేటును గత మార్చి 28న సిఫార్సు చేసింది.  ఈ సిఫార్సును అనుసరించి, వడ్డీ రేటును ఆర్థిక శాఖ ఆమోదించి నోటిఫై చేయాలి. అప్పుడే సభ్యుల ఖాతాల్లో జమ అవుతుంది. సాధారణంగా, వడ్డీ రేటును ఆర్థిక శాఖ ద్వారా ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తెలియజేస్తుంది. 2023 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ కోసం చందాదారులు ఇప్పటి వరకు వేచి చూశారు. 

ఎంప్లాయీస్‌ ప్రావెడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ అనేది దేశంలోనే అతిపెద్ద రిటైర్మెంట్ ఫండ్ మేనేజర్. ఇందులో  70.2 మిలియన్ల మంది ఉద్యోగులు, 0.75 మిలియన్ల కంపెనీలు సొమ్ము జమ చేస్తున్నారు.  సబ్‌స్క్రైబర్‌ల పాస్‌బుక్‌ని పన్ను పరిధిలోకి వచ్చే, పన్నేతర విరాళాలుగా విభజించాల్సి రావడంతో తలెత్తిన సాఫ్ట్‌వేర్ సమస్యల కారణంగా 22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ జమ ఆలస్యమైంది. 2021-22లో రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్‌లపై వచ్చే పొదుపు ఆదాయంపై ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను దీనికి కారణం.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)