Breaking News

ఈపీఎఫ్‌ సభ్యులకు త్వరలో డబుల్‌ ధమాకా!

Published on Sat, 06/20/2026 - 13:42

దేశంలోని 7 కోట్లకు పైగా ఈపీఎఫ్‌ (ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌) సభ్యులకు త్వరలో రెండు కీలక ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి. ఒకటి 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ డిపాజిట్లపై వడ్డీ జమ, రెండోది ఈపీఎఫ్‌ సభ్యులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్‌ విత్‌డ్రా సదుపాయం.

8.25 శాతం వడ్డీ 
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును కొనసాగించాలని ఈపీఎఫ్ఓ (EPFO) సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ సిఫారసు చేయగా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం అనంతరం ఈ నెలాఖరులోగా సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమయ్యే అవకాశముందని సమాచారం. దీంతో వరుసగా మూడో ఏడాది కూడా సభ్యులకు 8.25 శాతం వడ్డీ లభించనుంది.

ఈపీఎఫ్‌ ఏటీఎం/యూపీఐ విత్‌డ్రా
ఇదే సమయంలో ఈపీఎఫ్ఓ తన సేవలను పూర్తిగా డిజిటల్‌ దిశగా మార్చే ‘ఈపీఎఫ్ఓ 3.0’ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది. ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత సభ్యులు పేపర్‌లెస్‌ విధానంలో పీఎఫ్‌ క్లెయిమ్‌లు దాఖలు చేయడం, ఖాతాల బదిలీలు చేయడం, అలాగే అర్హత ఉన్న మొత్తాన్ని యూపీఐ లేదా యూపీఐ-సపోర్టెడ్‌ ఏటీఎంల ద్వారా నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసుకునే అవకాశం పొందనున్నారు. ఈ సదుపాయం కోసం అవసరమైన సాంకేతిక పరీక్షలు పూర్తయ్యాయని కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియా ఇటీవల వెల్లడించారు. అయితే దేశవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభించే ఖచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించలేదు.

ప్రతిపాదిత విధానాల ప్రకారం సభ్యుల పీఎఫ్‌ నిధుల్లో కొంత భాగాన్ని రిటైర్మెంట్‌ భద్రత కోసం కొనసాగిస్తూ, అర్హత ఉన్న మొత్తంలో 50 నుంచి 75 శాతం వరకు యూపీఐ లేదా ఏటీఎం ద్వారా ఉపసంహరించుకునే అవకాశం కల్పించే దిశగా ఈపీఎఫ్ఓ పనిచేస్తోంది. అయితే ఈ నిబంధనలు ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదని, అధికారిక మార్గదర్శకాలు వెలువడిన తర్వాతే తుది వివరాలు స్పష్టమవుతాయని అధికారులు చెబుతున్నారు.

ఇక సభ్యుల సౌకర్యార్థం ఆటో-సెటిల్‌మెంట్‌ క్లెయిమ్‌ పరిమితిని ఇప్పటికే రూ.5 లక్షలకు పెంచిన ఈపీఎఫ్ఓ, వైద్యం, విద్య, గృహ నిర్మాణం, వివాహం వంటి అవసరాలకు సంబంధించిన క్లెయిమ్‌లను సాధ్యమైనంత వేగంగా పరిష్కరించే చర్యలు చేపట్టింది. భవిష్యత్తులో ఉమాంగ్‌ యాప్‌లో ఫేస్‌ ఆథెంటికేషన్‌, వాట్సాప్‌ ఆధారిత సేవలు, తక్షణ పాస్‌బుక్‌ యాక్సెస్‌, ఆన్‌లైన్‌ వివరాల సవరణ వంటి సదుపాయాలు కూడా మరింత విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)