DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?
Breaking News
ఉద్యోగం మారితే EPF ఏమౌతుంది?
Published on Sat, 09/05/2026 - 13:59
ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ డబ్బులు ఏమవుతాయి? యూఏఎన్‌తో కొత్త కంపెనీకి ఎలా బదిలీ చేయాలి? అనే విషయంలో ఉద్యోగుల్లో ఇప్పటికీ చాలా సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం మారగానే పాత పీఎఫ్ ఖాతాలోని డబ్బు కొత్త కంపెనీకి ఆటోమేటిక్‌గా వెళ్లిపోతుందని భావించడం పూర్తిగా సరైనది కాదు. అయితే, యూఏఎన్ ఆధార్‌తో అనుసంధానమై, కేవైసీ పూర్తిగా ధ్రువీకరించి ఉంటే ఈ ప్రక్రియ ఇప్పుడు చాలా సులభతరమైంది.
ఉద్యోగం మారితే మీ పీఎఫ్ డబ్బుకు ఏమవుతుంది?
ఉద్యోగం మారినంత మాత్రాన పాత పీఎఫ్ బ్యాలెన్స్ పోదు. ఈపీఎఫ్‌వో (EPFO) ప్రకారం, ప్రతి ఉద్యోగికి కేటాయించే యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) జీవితకాలం ఒకటే ఉంటుంది. కంపెనీ మారినా కొత్త యూఏఎన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త యజమానికి పాత యూఏఎన్ వివరాలను అందిస్తే సరిపోతుంది.
ఒక ఈపీఎఫ్ పరిధిలోని సంస్థ నుంచి మరో ఈపీఎఫ్ సంస్థలోకి ఉద్యోగం మారితే, పాత సభ్యత్వ ఖాతాలోని PF మొత్తాన్ని కొత్త ఉద్యోగానికి అనుసంధానమైన సభ్యత్వ ఖాతాకు బదిలీ చేయవచ్చు. పాత ఉద్యోగంలో కూడిన సర్వీస్ కాలం కూడా కొనసాగుతుంది. ఇది భవిష్యత్తులో ఈపీఎఫ్, పెన్షన్ (EPS) ప్రయోజనాల విషయంలో కీలకంగా ఉంటుంది.
పీఎఫ్ ట్రాన్స్ఫర్లో కీలక మార్పు
ఇంతకుముందు ఉద్యోగి స్వయంగా ట్రాన్స్ఫర్ క్లెయిమ్ చేయాల్సిన సందర్భాలు ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం యూఏఎన్ ఆధార్‌తో అనుసంధానమై, KYC పూర్తిగా ధ్రువీకరించి ఉండి, పాత ఉద్యోగానికి నిష్క్రమణ తేదీ (Date of Exit) నమోదు చేసి ఉంటే, కొత్త కంపెనీ నుంచి మొదటి PF కంట్రిబ్యూషన్ అందిన తర్వాత ఆటో-ట్రాన్స్ఫర్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇలాంటి అర్హత ఉన్న సభ్యుడు ప్రత్యేకంగా ట్రాన్స్ఫర్ క్లెయిమ్ దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. ఈపీఎఫ్‌వో 2025లో పీఎఫ్ ట్రాన్స్ఫర్ ప్రక్రియను సరళీకరించింది. పాత ఖాతా నుంచి కొత్త ఖాతాకు బదిలీ పూర్తయ్యే విధానాన్ని మరింత ఆటోమేటెడ్‌గా మార్చింది.
ఎప్పుడు స్వయంగా పీఎఫ్ ట్రాన్స్ఫర్ చేయాలి?
ఆటో-ట్రాన్స్ఫర్ జరగకపోతే సభ్యుడు ఈపీఎఫ్‌వో మెంబర్ పోర్టల్ ద్వారా ట్రాన్స్ఫర్ క్లెయిమ్ చేయవచ్చు. ఇందుకు
యూఏఎన్ యాక్టివ్‌గా ఉండాలి.
ఆధార్, బ్యాంక్ వివరాలు యూఏఎన్‌కు అనుసంధానమై ఉండాలి.
KYC ధ్రువీకరణ పూర్తై ఉండాలి.
పాత ఉద్యోగానికి Date of Exit నమోదు అయి ఉండాలి.
వ్యక్తిగత వివరాలు సరైనవిగా ఉండాలి.
పాత ఉద్యోగానికి Date of Exit లేకపోతే, అర్హత ఉన్న సందర్భాల్లో ఉద్యోగి స్వయంగా దాన్ని అప్డేట్ చేసుకునే సదుపాయం కూడా ఈపీఎఫ్‌వో అందిస్తోంది.
పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలా.. బదిలీ చేసుకోవాలా?
ఉద్యోగం మారిన ప్రతిసారీ పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడం కంటే, కొత్త ఉద్యోగానికి బదిలీ చేసుకోవడమే ఉత్తమం. ఇలా చేస్తే పాత, కొత్త పీఎఫ్ ఖాతాల రికార్డులు ఒకే యూఏఎన్ కింద కొనసాగుతాయి. అంతేకాదు, నిరంతర సర్వీస్ కాలాన్ని కొనసాగించడంలో ఇది సహాయపడుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాల నిరంతర ఈపీఎఫ్ సర్వీస్ ఉంటే సంబంధించిన పన్ను ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగం మారినప్పుడల్లా పీఎఫ్‌ను ఉపసంహరించుకోవడం వల్ల దీర్ఘకాలిక రిటైర్మెంట్ కార్పస్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యవసర అవసరం లేకపోతే పీఎఫ్‌ను కొనసాగించడం లేదా బదిలీ చేయడం గురించి ఆలోచించడం మంచిది.
పీఎఫ్ ట్రాన్స్‌ఫర్‌కు ఏం కావాలి?
యూఏఎన్, ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు, పాత-కొత్త ఉద్యోగానికి సంబంధించిన పీఎఫ్ మెంబర్ ఐడీలు, Date of Exit వంటి వివరాలు సిద్ధంగా ఉండటం ఉపయోగకరం. వివాదం లేదా వివరాల్లో వ్యత్యాసం ఉంటే జీతం స్లిప్‌లు, సర్వీస్ రికార్డులు వంటి ఆధారాలు అవసరం కావచ్చు.
Tags : 1