Breaking News

ఇంజినీరింగ్‌ ఎగుమతుల్లో క్షీణత

Published on Sat, 08/26/2023 - 05:54

కోల్‌కతా: ఇంజనీరింగ్‌ ఎగుమతులు వరుసగా ఎనిమిదో నెల, జూలైలోనూ క్షీణతను చూశాయి. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 7 శాతం వరకు తగ్గి 8.75 బిలియన్‌ డాలర్లు (రూ.72,625 కోట్లు)గా ఉన్నాయి. ముఖ్యంగా భారత ఇంజనీరింగ్‌ ఎగుమతుల్లో 76 శాతం వాటా కలిగిన 25 మార్కెట్లలో.. 14 దేశాలకు ఎగుమతులు జూలైలో క్షీణించాయి. రష్యాకు ఇంజనీరింగ్‌ ఎగుమతులు రెట్టింపయ్యాయి.

123.65 మిలియన్‌ డాలర్ల (రూ.1025 కోట్లు) విలువ మేర ఎగుమతులు రష్యాకు వెళ్లాయి. క్రితం ఏడాది ఇదే నెలలో రష్యాకు ఇంజనీరింగ్‌ ఉత్పత్తులఎగుమతులు 55.65 మిలియన్‌ డాలర్ల మేర నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది జూలై నెలలో అమెరికాకు ఇంజనీరింగ్‌ ఎగుమతులు 10 శాతం మేర క్షీణించి 1.44 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. చైనాకు సైతం ఈ ఉత్పత్తుల ఎగుమతులు 10 శాతం తగ్గి 198 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఈ వివరాలను ఇంజనీరింగ్‌ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈఈపీసీ) విడుదల చేసింది.

ఐరన్, స్టీల్, అల్యూమినియం ఎగుమతులు క్షీణించడమే ఈ పరిస్థితికి కారణం. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొనడం తెలిసిందే. చైనా, అమెరికా, యూరప్‌ తదితర దేశాలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుండడం మన ఎగుమతులపై ప్రభావం చూపించింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో భారత్‌ తన ఎగుమతులను ఇతర మార్కెట్లలోకి వైవిధ్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈఈపీసీ ఇండియా చైర్మన్‌ అరుణ్‌ కుమార్‌ గరోడియా అభిప్రాయపడ్డారు. ‘‘2022 డిసెంబర్‌ నుంచి వరుసగా ఎనిమిది నెలల పాటు ఎగుమతులు క్షీణించడం అన్నది అంతర్జాతీయ వాణిజ్యం ఒత్తిడిలో ఉందని తెలియజేస్తోంది. భారత ఎగుమతిదారులు ఆఫ్రికా, ల్యాటిన్‌ అమెరికా దేశాలకు తమ ఎగుమతులను వైవిధ్యం చేసుకునేందుకు ఇది ఒక అవకాశం’’అని గరోడియా సూచించారు.0000

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)