Breaking News

కార్పొరేట్‌ ఇంజినీర్‌ కన్నా క్యాబ్‌ డ్రైవరే నయం! సోషల్‌ మీడియా పోస్ట్‌ వైరల్‌..

Published on Wed, 08/09/2023 - 19:34

ఈరోజుల్లో చాలా మంది తమ చదువుకు తగిన ఉద్యోగం చేయడం లేదు. ఒక వేళ చేసినా అందులో సంతృప్తి లేక కొన్ని రోజులకే మానేసి వేరే పని చేసుకుంటున్నారు. కొంతమంది విధి లేక ఇలా చేస్తుంటే మరికొంత మంది మాత్రం పెద్ద చదువులు చదువుకున్నా కూడా ఇష్టపూర్వకంగానే చిన్న చిన్న పనులు  చేస్తున్నారు. ఇలా చిన్న పనులు చేసుకునేవారిని చిన్నచూపు చూస్తుంటారు. వారు పెద్దగా సంపాదించలేరు అనుకుంటుంటారు. కానీ కార్పొరేట్‌ కంపెనీల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారి కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నారు. అలాంటి దానికి ఉదాహరణే ఈ సంఘటన.

రద్దీగా ఉండే రోడ్డుపై క్యాబ్ నడిపే వ్యక్తి కూడా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చునే ఇంజనీర్ కంటే ఎక్కువే సంపాదిస్తున్నాడంటే మీరు నమ్మకపోవచ్చు. అయితే ఇది నిజం. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఓ క్యాబ్ డ్రైవర్ ఉద్యోగం, సంపాదన గురించి సోషల్ మీడియాలో శ్వేతా కుక్రేజా  అనే యూజర్ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఇటీవల తాను ఓ క్యాబ్‌లో ప్రయాణించానని, ఆ క్యాబ్ డ్రైవర్ ఇంజనీర్ అని పేర్కొన్నారు. తాను ఇంతకుముందు క్వాల్‌కామ్‌ కంపెనీలో పనిచేసేవాడినని చెప్పిన అతను, ఆ ఉద్యోగంతో కంటే క్యాబ్‌ డ్రైవింగ్‌తోనే ఎక్కువగా సంపాదిస్తున్నానని చెప్పినట్లు శ్వేత ట్వీట్ చేశారు.

శ్వేత ఆగస్ట్‌ 6న ఈ ట్వీట్ చేయగా ఇ‍ప్పటి వరకు 7.7 లక్షల మంది వీక్షించారు. 6,700లకు పైగా లైక్‌లు వచ్చాయి. క్యాబ్‌ డ్రైవర్‌ సంపాదనపై యూజర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టారు. కార్పొరేట్‌ జాబ్‌లు చేసినంత మాత్రాన ఎవరూ గొప్పవారు కాదని, క్యాబ్‌ డ్రైవర్లు ఎంత మాత్రం తక్కువ కాదని శ్వేత పేర్కొన్నారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?