Breaking News

గుడ్‌న్యూస్‌.. ఈవీ సబ్సిడీ స్కీమ్‌ పొడిగింపు

Published on Sat, 07/27/2024 - 20:53

ఎలక్ట్రిక్ వాహనాలపై అందించే అందించే సబ్సిడీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. ఫేమ్‌-2 పథకం ముగిసిన తర్వాత తాత్కాలికంగా తీసుకొచ్చిన ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్’ (EMPS) 2024 ను పొడిగిస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈఎంపీఎస్‌ పథకం జూలై 31తో ముగియాల్సి ఉండగా మరో రెండు నెలలు అంటే సెప్టెంబరు 30 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఇందు కోసం రూ. 778 కోట్లు అదనంగా కేటాయిస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ పేర్కొంది. ఈ పథకం కింద 5,00,080 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 60,709 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు మొత్తంగా 5,60,789 ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతు ఇవ్వనున్నట్లు పేర్కొంది. అయితే అధునాతన బ్యాటరీలతో కూడిన ఈవీలకు మాత్రమే ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. ప్రైవేట్ లేదా కార్పొరేట్ యాజమాన్యంలోని రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు కూడా ఈ పథకం కింద అర్హత ఉంటుంది.

ఫేమ్‌ (ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌) రెండవ దశ గడువు ముగియడానికి ముందు మార్చి 13న కేంద్ర ప్రభుత్వం ఈఎంపీఎస్‌ 2024ని ప్రకటించింది. రూ.500 వ్యయంతో నాలుగు నెలలపాటు జూలై 31 వరకు 3,33,387 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 13,590 ఎలక్ట్రిక్ త్రీవీలర్లకు మద్దతు ఇవ్వడానికి దీన్ని అమలు చేశారు.

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు