పనివేళల తర్వాత నో కాల్స్‌.. నో ఈమెయిల్స్‌

Published on Mon, 12/08/2025 - 19:16

డిజిటల్ యుగంలో వర్క్‌-లైఫ్‌ సమతుల్యత తీవ్రంగా ప్రభావితమవుతోందనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఆఫీసు పనివేళల తర్వాత పని సంబంధిత కాల్స్, ఈమెయిల్స్ లేదా ఇతర కమ్యూనికేషన్ల నుంచి దూరంగా ఉండే హక్కును కల్పించే ఒక ముఖ్యమైన ప్రైవేట్ మెంబర్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP-శరద్‌చంద్ర పవార్) ఎంపీ సుప్రియా సూలే ఈ ‘రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్లు, 2025’ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పని భారం పెరిగి, వ్యక్తిగత సమయం కరువవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని, శ్రేయస్సును కాపాడటమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని చెప్పారు.

రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్లు, 2025

పనివేళలు ముగిసిన తర్వాత, అలాగే సెలవు దినాల్లో పని సంబంధిత ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లకు (కాల్స్, ఈమెయిల్స్, మెసేజ్‌లు) స్పందించకుండా ఉండే చట్టబద్ధమైన హక్కును ఉద్యోగులకు కల్పించడం దీని ఉద్దేశం. ఈ హక్కును వినియోగించుకున్నందుకుగాను ఉద్యోగిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు లేదా ప్రతికూల శిక్షలు ఉండకుండా ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది.

ఈ బిల్లు ఉద్యోగుల సంక్షేమ అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. 10 మందికి పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీలు పనివేళల తర్వాత కమ్యూనికేషన్ నిబంధనలపై ఉద్యోగులతో చర్చలు జరపడం, నిబంధనలు ఉల్లంఘించిన యజమానులపై జరిమానా (ఉద్యోగుల మొత్తం వేతనంలో 1% వరకు) విధించడం వంటివి కూడా ఈ బిల్లులో ఉన్నాయి.

ప్రైవేట్ మెంబర్ బిల్లు మాత్రమే..

ఇది ప్రైవేట్ మెంబర్ బిల్లు. కేంద్ర మంత్రులు కాకుండా సాధారణ పార్లమెంట్ సభ్యులు ప్రవేశపెట్టే ఈ బిల్లులు చట్టాలుగా మారడం భారతదేశంలో చాలా అరుదు. అయినప్పటికీ, ఇది ఉద్యోగుల వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ గురించి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

ఇదీ చదవండి: ‘యూరప్‌ కంటే మనం చాలా నయం’

Videos

చిన్న వయసులోనే చాలా చూశా.. బోరున ఏడ్చేసిన కృతిశెట్టి

Vasupalli Ganesh: రీల్స్ నాయుడు.. రాజీనామా చేసి ఇంట్లో కూర్చో

ఆమె పక్కన కూర్చోవాలంటే సిగ్గేసేది.. సమంతపై శోభారాజు కామెంట్స్..!

తిరుపతికి కొత్త రైలు..16వేల‌ కోట్లతో ఏపీకి భారీ బడ్జెట్

పని చేయకుండా రీల్స్ చేస్తే ఇలానే ఉంటది చంద్రబాబు, రామ్మోహన్ పై పేర్ని నాని సెటైర్లే సెటైర్లు

టీడీపీకి భారీ షాక్.. YSRCPలో చేరిన 100 కుటుంబాలు

Perni Nani: మరోసారి బాబు అబద్దాలు.. 10 లక్షల కోట్లు అప్పు అంటూ

KA Paul: నన్నే అడ్డుకుంటారా చంద్రబాబుపై KA పాల్ ఫైర్

Puducherry: కరూర్ తొక్కిసలాట తర్వాత తొలి ర్యాలీలో పాల్గొన్న విజయ్

Big Shock To Indigo: ఇండిగో సర్వీస్‌పై DGCA కోత

Photos

+5

‘అన్నగారు వస్తారు’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘న‌య‌నం’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

హార్దిక్‌ పాండ్యా సూపర్‌ షో...తొలి టి20లో భారత్‌ ఘన విజయం (ఫొటోలు)

+5

గ్లోబల్‌ సమిట్‌లో సినీ ప్రముఖుల సందడి.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ (చిత్రాలు)

+5

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. డే2 స్పెషల్‌ ఎట్రాక్షన్స్‌ ఇవిగో (ఫొటోలు)

+5

స్వదేశీ దుస్తుల్లో ఆదితి రావు హైదరీ నేచురల్‌ బ్యూటీ లుక్ (ఫొటోలు)

+5

ప్రతిరోజూ మిస్ అవుతున్నా.. 'కేదార్‌నాథ్' జ్ఞాపకాల్లో సారా (ఫొటోలు)

+5

Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు విక్రమ్ ప్రభు (ఫోటోలు)

+5

యూత్‌ను గ్లామర్‌తో కొల్లగొట్టిన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

తరుణ్ భాస్కర్,ఈషా రెబ్బ 'ఓం శాంతి శాంతి శాంతి’ టీజర్ రిలీజ్ (ఫొటోలు)