Breaking News

సీఈవోకే దడ పుట్టించిన హెచ్‌ఆర్‌..!!

Published on Mon, 11/10/2025 - 13:58

ప్రైవేటు ఉద్యోగాల్లో ఇప్పుడు లేఆఫ్‌లు, ఉద్యోగుల తొలగింపులు చర్చనీయాశంగా మారాయి. ఎప్పుడు ఎవరికి ఉద్వాసన వస్తుందో చెప్పలేనట్టుగా పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్‌ఆర్‌ నుంచి టర్మినేషన్‌ లెటర్‌ వస్తే ఏ ఉద్యోగి అయినా హడలిపోతారు. అదే సీఈవోతో సహా సంస్థలోని ఉద్యోగులందరికీ తొలగింపు లెటర్లు వస్తే..

ఈ సంఘటన ఓ కంపెనీలో చోటుచేసుకుంది. అయితే ఇదంతా పొరపాటున జరిగింది. తమ సంస్థలో జరిగిన ఈ ఉదంతం గురించి ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్ంగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘రెడిట్‌’లో ఓ యూజర్‌ పంచుకున్నారు. టెంప్లేట్ చేసిన "టర్మినేషన్‌" ఈమెయిల్‌లను పంపే కొత్త ఆఫ్ బోర్డింగ్ ఆటోమేషన్ సాధనాన్ని హెచ్‌ఆర్ విభాగం పరీక్షిస్తుండగా "టెస్ట్ మోడ్ నుండి లైవ్ మోడ్‌కు మారడం ఎవరో మర్చిపోయారు" అని యూజర్‌ పోస్ట్ లో వివరించారు.

పొద్దుపొద్దున్నే కంపెనీ సీఈవోతో సహా మొత్తం 300 మంది ఉద్యోగులకు ఒక ఈమెయిల్ వచ్చింది. 'ఇది మీ చివరి పని దినం తక్షణమే అమలులోకి వస్తుంది' అని అందులో పేర్కొన్నారు. ఇది పొరపాటున వచ్చిందని ఉద్యోగులు ఉద్యోగులు గుర్తించినప్పటికీ ఒక మేనేజర్ అయితే "ఇక నేను సర్దుకోవడం ప్రారంభించాలా?" అంటూ అడిగారని, చివరికి ఐటీ విభాగం రంగంలోకి దిగి "ఎవరినీ తొలగించలేదు.. దయచేసి మీ బ్యాడ్జీలను తీసేయొద్దు " అని పెద్ద అక్షరాలతో సందేశాన్ని పోస్ట్ చేయవలసి వచ్చిందని రెడిటర్‌ పేర్కొన్నారు.

ఈ విచిత్ర సంఘటన గురించిన పోస్ట్‌ వెంటనే వైరల్‌గా మారిపోయింది. వేలాదిగా అప్ ఓట్లు, కామెంట్లు వెల్లువెత్తాయి. ఘటనపై యూజర్లు తమకు తోచిన విధంగా వ్యాఖ్యానిస్తూ తమ యాజమాన్యాలతో ఎదురైన సొంత అనుభవాలను కామెంట్‌ చేశారు. ఇలాంటి సాధనం కావాలని భావించే ఏ సంస్థ అయినా విఫలం అవుతుందంటూ ఒక యూజర్‌ వ్యాఖ్యానించారు.

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)