Breaking News

‘సంస్థ నన్ను వాడుకొని, వదిలేసింది’.. టాయిలెట్ పేపర్‌పై ఉద్యోగి రాజీనామా లేఖ

Published on Tue, 04/15/2025 - 21:44

బెంగళూరు: ‘నేనో సంస్థలో పనిచేస్తున్నా. సదరు సంస్థ నన్ను ఉద్యోగిలా కాకుండా టాయిలెట్‌ పేపర్‌లా ట్రీట్‌ చేసింది. అందుకే ఈ కంపెనీకి నేను రాజీనామా చేస్తున్నా’నంటూ ఓ ఉద్యోగి తన జాబ్‌కు రిజైన్‌ చేశాడు. ప్రస్తుతం, టాయిలెట్‌ పేపర్‌ మీద (Toilet Paper Resignation) రాసిన ఆ రిజిగ్నేషన్‌ లెటర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది

రిజిగ్నేషన్ లెటర్‌ అంటే ఫ్రమ్‌ నుంచి టూ వరకు ఉద్యోగి వివరాలు, రిజిగ్నేషన్‌కి గల కారణాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఇటీవల కాలంలో పలువురు ఉద్యోగులు  కట్టె.. కొట్టె.. తెచ్చె అన్నట్లు మూడే మూడు ముక్కల్లో రాజీనామా గురించి తేల్చేస్తున్నారు. హెచ్‌ఆర్‌లకు రిజిగ్నేషన్‌ లెటర్లు పంపిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం ఓ ఉద్యోగి ఏడే ఏడు పదాల్లో తన రిజిగ్నేషన్‌ను సమర్పించాడు. ఇప్పుడు మరో ఉద్యోగి ఓ టాయిలెట్‌ పేపర్‌ మీద తన రిజిగ్నేషన్‌ చేశాడు. సింగపూర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన లింక్డిన్‌ పోస్టులో సదరు ఉద్యోగి ఇచ్చిన రాజీనామా లేఖను పోస్టు చేశారు. ఆ పోస్టు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

‘నన్ను ఈ కంపెనీ టాయిలెట్ పేపర్‌లా (Felt Like Toilet Paper) ఉపయోగించుకుంది. అవసరం ఉన్నప్పుడు వాడుకుంది. అవసరం తీరిన తర్వాత నన్ను వదిలేసింది అంటూ ఉద్యోగి కంపెనీపై తన బాధను వెళ్లగక్కాడు. తన స్వహస్తాలతో రాసిన టాయిలెట్‌ పేపర్‌ రిజిగ్నేషన్‌లో ఈ కంపెనీ నాకు ఎలా విలువ ఇవ్వలేదో, అదే విధంగా నేను కూడా ఆ కంపెనీకి విలువ ఇవ్వాలని అనుకోవడం లేదు. అందుకే టాయిలెట్‌ పేపర్‌ మీద నా రాజీనామా చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.

ఈ విషయాన్ని ఆ కంపెనీ డైరెక్టర్ ఏంజెలా యెఓహ్ స్వయంగా లింక్డిన్‌లో షేర్‌ చేయడమే కాదు. ఉద్యోగుల పట్ల సంస్థలు ఎలా ఉండాలో తెలిపారు.  ఉద్యోగులు సంస్థకు రాజీనామా చేసే వెళ్లే సమయంలో కృతజ్ఞతతో వెళ్లేలా మనం వాళ్లను సంతోషంగా ఉంచాలి. వారి విలువను గుర్తించాలి’ అని విజ్ఞప్తి చేశారు.  

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)