Breaking News

సిక్ లీవ్ అడిగితే జీతం కోత!

Published on Sun, 03/15/2026 - 08:16

ఇటీవల నోయిడాలోని ఒక SaaS స్టార్టప్ కంపెనీకి చెందిన ఉద్యోగి సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్..చాలా వైరల్ అయింది. ఈ పోస్ట్ ద్వారా ఇండియన్ స్టార్టప్ కంపెనీలలో ఉన్న పనిసంస్కృతి గురించి పెద్ద చర్చ మొదలైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం.. SaaS స్టార్టప్‌లో సపోర్ట్ ఉద్యోగిగా వ్యక్తికి.. ఒక రోజు అతని ప్రాంతంలో రాత్రంతా విద్యుత్ సరఫరా లేకపోవడంతో సరిగా నిద్రపట్టలేదు. నిద్రలేమి వల్ల అతను అలసటగా అనిపించింది. దీంతో ఆ రోజు పని చేయలేనని భావించి.. హెచ్ఆర్ విభాగానికి ఒక సిక్ లీవ్ కోసం ఈమెయిల్ పంపాడు. ఆ ఉద్యోగి చెప్పినట్టు, ఆరు నెలల్లో ఇది అతను తీసుకున్న రెండో సెలవు మాత్రమే.

అయినప్పటికీ.. అతను ఊహించని విధంగా కంపెనీ ఫౌండర్ స్వయంగా ఆ ఈమెయిల్‌కు స్పందించారు. ఆ ఉద్యోగికి ఒకరోజు జీతం కోత పెట్టాలని HRకు సూచించారు. అదే రోజు సెలవు తీసుకోవడం కుదరదని కూడా చెప్పారు. అంతే కాకుండా.. ఫౌండర్ ఆ ఉద్యోగికి ఫోన్ చేసి మాట్లాడారు. ఉద్యోగి తాను అస్వస్థంగా ఉన్నానని చెప్పినా, ఫౌండర్ 'నీ వాయిస్ చూస్తే నువ్వు బాగానే ఉన్నట్టు అనిపిస్తోంది' అని చెప్పారు. ఇది ఆ ఉద్యోగికి చాలా బాధ కలిగించింది.

ఇదీ చదవండి: మస్క్ టీమ్‌లో చేరిన ఇండియన్: ఎవరీ దేవేంద్ర చాప్లోట్?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో.. పలువురు నెటిజన్లు స్పందించారు. వ్యవస్థాపకులు చాలా సున్నితంగా వ్యవహరించాలి అని కొందరు చెబితే.. మరికొందరు ఆ ఉద్యోగిని వేరే ఉద్యోగం చూసుకోమని సలహా ఇచ్చారు. ఈ వ్యవస్థాపకులు లేదా ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఏమి ఆలోచిస్తారో నాకు అర్థం కావడం లేదు. వారి ఉద్యోగులతో సరిగ్గా వ్యవహరించలేరు. వారు మనల్ని ఏమని భావిస్తారు? అని ఇంకొందరు అంటున్నారు.

#

Tags : 1

Videos

పెద్ద తలకాయలు ఎంట్రీ.. పుట్టా మహేష్ కు నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు

రైతుకు CI బెదిరింపులు.. ఎక్కడా భయపడని రైతన్న.. ఆడియో కాల్ లీక్

డ్రాగన్ పై దురంధర్ ఎఫెక్ట్..!

ఇంత నోరేసుకొని అరవడం కాదు.. అనితను ఏకిపారేసిన రాచమల్లు

పుట్టా మహేష్ డ్రగ్స్ కేసు.. తండ్రి కొడుకులకి ఇచ్చిపడేసిన కన్నబాబు

నువ్వు ఎంపీనా? డ్రగ్స్ డీలరా? టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ పై విజయ్ రాజు ఫైర్

ఇజ్రాయెల్ పై మరోసారి దాడి.. నేలకూలిన భారీ భవనాలు

నెల్లూరు జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న జనసేన నేతలు

మద్ది శ్రీనివాస్ రాసలీలలు.. భార్య సంచలన నిజాలు

డ్రగ్స్ కేసు నుండి తప్పించేందుకు రంగంలోకి పెద్ద తలకాయలు

Photos

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)

+5

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్‌ పోస్ట్‌ (ఫొటోలు)

+5

అల్లు సినిమాస్‌ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)

+5

కూకట్‌పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)

+5

ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)

+5

‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌, బన్నీ (ఫోటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్‌- సానియా సంగీత్‌.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)