రూ. 26వేల జీతం.. ₹70000 ఐఫోన్: మండిపడుతున్న నెటిజన్స్

Published on Fri, 11/28/2025 - 18:55

ఈ రోజుల్లో ఐఫోన్ కొనుగోలు చేయడం అనేది.. చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది. ఈ కారణంగానే కొత్త మోడల్ మార్కెట్లోకి రాగానే ఎగబడిమరీ కొనేస్తుంటారు. ధరలు ఎంత ఉన్నప్పటికీ.. తగ్గేదే అన్నట్టు ఈఎంఐ ఎంపిక చేసుకుంటున్నారు. ఇటీవల రూ. 26వేలు జీతం ఉన్న వ్యక్తి.. రూ. 70000 ఐఫోన్ కొన్నారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఢిల్లీకి చెందిన కవల్జీత్ సింగ్ (ఖడక్ సింగ్ దా ధాబా కో ఫౌండర్, ది చైనా డోర్ ఫౌండర్) తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన సమాచారం ప్రకారం.. రూ. 26,000 జీతం ఉన్న తన ఉద్యోగి రూ. 70,000 ఐఫోన్‌ను ఎలా కొన్నారో వివరించారు. తన ఉద్యోగి ఇంత బాధ్యతారహితమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం.. తెలుసుకుని ఆయన ఆశ్చర్యపోయారు.

ఐఫోన్ కొన్న ఉద్యోగి.. తన కంపెనీలో డెలివరీ డ్రైవర్‌గా చేరారని, కొన్ని సంవత్సరాలలోనే అతడు స్థానిక కార్యకలాపాలను చూసుకుంటున్నారని కవల్జీత్ సింగ్ అన్నారు. అయితే ఈ మధ్యకాలంలో సంస్థ నుంచి రూ. 14000 అడ్వాన్స్ తీసుకుని, మిగిలిన మొత్తాన్ని 12 నెలల ఈఎంఐ ఆప్షన్ కింద చెల్లింపు ఎంచుకున్నాడు.

తన జీతం రూ. 26000, ఇప్పుడు ఐఫోన్ కోసం అడ్వాన్స్ తీసుకున్నాడు, ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్నాడు. అయితే అతనిపై తన ముగ్గురు పిల్లలు, భార్య ఆధారపడి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. అతడు ఐఫోన్ కొనడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించిందని కవల్జీత్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.

దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కొందరు అతని నిర్ణయాన్ని తప్పుపట్టారు. మరికొందరు కవల్జీత్ సింగ్ తక్కువ జీతం ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుని.. తాను తీసుకునే నిర్ణయం తప్పు అని చెప్పి ఉంటే బాగుండేదని అన్నారు.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)