Breaking News

ఈఎంఐ, రుణంపై షాపింగ్‌

Published on Tue, 12/20/2022 - 06:08

హైదరాబాద్‌: దేశవాసుల్లో సగానికి సగం మంది షాపింగ్‌ను ఈఎంఐ కార్డుపై లేదంటే రుణంపై చే య­డానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు హోమ్‌ క్రెడిట్‌ ఇండియా తెలిపింది. ఈ సంస్థ వినియోగదారు ధోరణలుపై సర్వే నిర్వహించి నివేదిక విడుదల చేసింది.  

► 25 శాతం మంది క్రెడిట్‌ కార్డులతో షాపింగ్‌ చేస్తామని చెప్పారు.
► బీఎన్‌పీఎల్‌ తదితర నూతనతరం సాధనాల ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేస్తామని చెప్పిన వారు 10 శాతంలోపు ఉన్నారు.  
► 60 శాతం మంది ఎంబెడెడ్‌ ఫైనాన్స్‌ పట్ల ఆసక్తి చూపించారు. అంటే ఈ కామర్స్‌ సంస్థలే కొనుగోలు మొత్తాన్ని రుణ ఈఎంఐలుగా బదిలీ చేస్తా యి.
► 52 శాతం మంది హైదరాబాదీలు ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ (ఆర్థిక నిర్వహణ) పట్ల ఆసక్తి ప్రదర్శించారు.
► ఆన్‌లైన్‌ షాపింగ్‌కు ఎంబెడెడ్‌ ఫైనాన్స్, ఈఎంఐ సాధనాల వినియోగం పట్ల హైదరబాదీలు తక్కువ ఆసక్తి చూపించారు.
► ముఖ్యంగా దక్షిణాది ప్రజలు ఆర్థిక అంశాలను తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు.
► 54 శాతం మంది ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ కంటే మొబైల్‌ బ్యాంకింగ్‌ వాడుతున్నట్టు చెప్పారు.  
► ఫిన్‌టెక్‌ వృద్ధి పట్ల 49 శాతం మంది ఆశాభావం వ్యక్తం చేశారు.  
► టైర్‌ 1, టైర్‌ 2 పట్టణాల్లో మూడొంతులు మంది జెనరేషన్‌ జెడ్‌/మిలీనియల్స్‌ డిజిటల్‌ లెండింగ్‌ (ఆన్‌లైన్‌ రుణ సదుపాయాలు) సేవల పట్ల సానుకూలంగా ఉన్నారు.
► దేశవ్యాప్తంగా 16 పట్టణాలకు చెందిన 1,600 మంది హోమ్‌ క్రెడిట్‌ కస్టమర్ల అభిప్రాయాను ఈ సర్వే కోసం తెలుసుకున్నారు.  
► కరోనా అనంతరం ఆర్థిక అక్షరాస్యత కీలకమైన చర్చనీయాంశంగా మారినట్టు, దేశవ్యాప్తంగా 40 శాతం మంది ఆర్థిక అంశాల గురించి వివరంగా తెలుసుకోవాలన్న ఆసక్తి చూపిస్తున్నట్టు హోమ్‌ క్రెడిట్‌ ఇండియా తెలిపింది.

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)