Breaking News

ఏడాదికి 60వేల లిఫ్ట్‌లు: ఈ విషయాలు తెలుసా?

Published on Mon, 07/13/2026 - 15:51

భారతదేశంలో నగరాలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. ఎత్తైన అపార్ట్‌మెంట్లు, ఐటీ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు వేగంగా నిర్మితమవుతున్నాయి. దీంతో లిఫ్ట్‌లు (ఎలివేటర్లు) మన రోజువారీ జీవితంలో అత్యంత కీలకమైన భాగంగా మారిపోయాయి. ఒకప్పుడు లిఫ్ట్‌లు కేవలం పెద్ద భవనాల్లో మాత్రమే కనిపించేవి. కానీ.. ఇప్పుడు చిన్న అపార్ట్‌మెంట్ల నుంచి భారీ టవర్ల వరకు దాదాపు ప్రతి భవనంలో లిఫ్ట్ తప్పనిసరిగా ఉంటుంది. రోజూ లక్షలాది మంది వీటిని ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ.. వీటి నిర్వహణ, భద్రత విషయంలో మాత్రమే చాలా చోట్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది.

ఏడాది 60 వేలకుపైగా కొత్త లిఫ్ట్‌లు
ప్రస్తుతం భారత్‌లో ప్రతి ఏడాది 60 వేలకుపైగా కొత్త లిఫ్ట్‌లు ఏర్పాటు అవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. వర్టికల్ మొబిలిటీ రంగంలో.. భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఎదిగింది. అయినప్పటికీ.. లిఫ్ట్‌లు సురక్షితంగా పనిచేయాలంటే వాటికి క్రమం తప్పకుండా మెయింటెనెన్స్ అవసరమనే విషయాన్ని చాలామంది పెద్దగా పట్టించుకోరు.

ఒక లిఫ్ట్ అంటే కేవలం పైకి, కిందికి వెళ్లే యంత్రం మాత్రమే కాదు. ప్రతిరోజూ వందలాది మంది ప్రాణాలను సురక్షితంగా ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు చేర్చే బాధ్యత దానిపై ఉంటుంది. అందుకే.. దీని నిర్వహణను కూడా విమానం లేదా కారుకు ఇచ్చే ప్రాధాన్యతతో చూడాలి. విమానాలకు నిర్ణీత వ్యవధిలో తప్పనిసరిగా తనిఖీలు నిర్వహిస్తారు. ఏ చిన్న లోపం కనిపించినా వెంటనే సరిచేస్తారు. అదే విధంగా లిఫ్ట్‌లను కూడా క్రమం తప్పకుండా తనిఖీ చేసి, అవసరమైన విడిభాగాలను సమయానికి మార్చితే ప్రమాదాల అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి.

AMC ముఖ్యం
ఈ విషయంలో వార్షిక నిర్వహణ ఒప్పందాలు (AMC- Annual Maintenance Contract) చాలా ఉపయోగపడతాయి. ఏఎంసీ ఉంటే లిఫ్ట్‌ను తనిఖీ చేయడం, అరిగిపోయిన భాగాలను మార్చడం, సాంకేతిక లోపాలను ముందుగానే గుర్తించడం అన్నమాట. దీంతో లిఫ్ట్ ఎప్పుడూ సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది.

చిన్న సమస్య - పెద్ద ప్రమాదాలు
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లిఫ్ట్ ప్రమాదాల్లో చాలా వరకు సరైన నిర్వహణ లేకపోవడం లేదా సర్వీసింగ్ ఆలస్యం కావడమే ప్రధాన కారణం. అందుకే లిఫ్ట్ పనిచేస్తోంది కదా అని నిర్లక్ష్యం చేయకుండా, దాని నిర్వహణపై కూడా సమానంగా దృష్టి పెట్టాలి. అయితే.. భద్రత అనేది కేవలం లిఫ్ట్ తయారీ సంస్థ లేదా నిర్వహణ సంస్థ బాధ్యత మాత్రమే కాదు. భవన యజమానులు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు, ఫెసిలిటీ మేనేజర్లు, నివాసితులు కూడా తమ వంతు బాధ్యత తీసుకోవాలి. లిఫ్ట్‌లో ఏదైనా కొత్త శబ్దాలు వినిపించడం, తలుపులు సరిగా ఓపెన్ కాకపోవడం, అంతస్తు వద్ద సరిగ్గా ఆగకపోవడం వంటి చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా.. వెంటనే సాంకేతిక నిపుణులకు తెలియజేయాలి. చిన్న సమస్యలను సమయానికి పరిష్కరిస్తే పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు.

ఇక ప్రభుత్వం తీసుకొచ్చిన IS 17900 (Part 1 & Part 2) వంటి కొత్త భద్రతా ప్రమాణాలు కూడా ఈ రంగానికి మరింత బలం చేకూరుస్తాయి. దేశవ్యాప్తంగా ఈ నిబంధనలు సమర్థంగా అమలైతే లిఫ్ట్‌ల నాణ్యత, భద్రత మరింత మెరుగుపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలను తప్పకుండా పాటించాలి. ప్రమాదాలను నివారించాలి.

సెబీ జోసెఫ్ - OTIS ఇండియా ప్రెసిడెంట్

#

Tags : 1

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)