Breaking News

ఎలక్ట్రానిక్స్ భాగాల తయారీపై కస్టమ్స్ సుంకం మాఫీ!

Published on Thu, 07/09/2026 - 12:03

దేశీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వేరబుల్స్ (స్మార్ట్ వాచీలు వంటివి), స్మార్ట్ టీవీల తయారీలో అత్యంత కీలకమైన భాగాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని (బీసీడీ) కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మూడు వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేసింది.

మూడు భాగాలకు సుంకం మినహాయింపు

ఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి ప్రధానంగా నిలిచే మూడు భాగాల ఉత్పత్తిలో ఉపయోగించే వస్తువులపై ఈ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు వర్తిస్తుంది.

డిస్ప్లే అసెంబ్లీలు: స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌ల స్క్రీన్ల తయారీకి ఇవి కీలకం.

లిథియం అయాన్ సెల్స్: ఆధునిక గ్యాడ్జెట్ల బ్యాటరీల తయారీకి ఇవి ఆధారం.

ఇండక్టర్ కాయిల్ మాడ్యూల్స్: విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలో వీటిని వాడుతుంటారు.

పీఎల్ఐ పథకానికి అదనపు బూస్ట్

భారతదేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకానికి ఈ నిర్ణయం ఊపునివ్వనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ వ్యూహాత్మక చర్య వల్ల ముడిసరుకు దిగుమతులపై ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గుతుంది. దేశీయంగా విడిభాగాల తయారీ యూనిట్లు వేగంగా విస్తరిస్తాయి. తయారీ వ్యయం తగ్గడం వల్ల భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ధరలు వినియోగదారులకు మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఐదేళ్ల పాటు వర్తింపు

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ సుంకం మాఫీ తక్షణమే అమలులోకి రానుంది. స్థానిక పరిశ్రమలు స్థిరపడటానికి, దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించడానికి వీలుగా ఈ మినహాయింపును 2029 మార్చి 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం గడువు విధించింది.

ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప మార్పు

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)