Breaking News

ఐషర్‌ మోటార్స్‌ లాభం జూమ్‌

Published on Wed, 02/15/2023 - 04:29

న్యూఢిల్లీ: ఆటో రంగ దిగ్గజం ఐషర్‌ మోటార్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 62 శాతం దూసుకెళ్లి రూ. 741 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 456 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,973 కోట్ల నుంచి రూ. 3,913 కోట్లకు జంప్‌ చేసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 2,416 కోట్ల నుంచి రూ. 3,006 కోట్లకు పెరిగాయి.

ఈ కాలంలో వాణిజ్య వాహన భాగస్వామ్య సంస్థ వోల్వో ఐషర్‌ కమర్షియల్‌ వెహికల్‌ 13 శాతం వృద్ధితో 18,162 యూనిట్లను విక్రయించినట్లు ఐషర్‌ మోటార్స్‌ పేర్కొంది. కంపెనీ చరిత్రలోనే ఇవి అత్యధికంకాగా.. ద్విచక్ర వాహన విభాగం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అమ్మకాలు సైతం 31 శాతం జంప్‌చేశాయి. 2,19,898 మోటార్‌ సైకిళ్లను విక్రయించింది. గత కొద్ది నెలలుగా ప్రవేశపెట్టిన కొత్త మోడళ్లు హంటర్‌ 350, సూపర్‌ మీటియోర్‌ 650కు అంతర్జాతీయంగా డిమాండ్‌ కనిపిస్తున్నట్లు కంపెనీ ఎండీ సిద్ధార్థ లాల్‌ తెలియజేశారు.

ఫలితాల నేపథ్యంలో ఐషర్‌ మోటార్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.2 శాతం నీరసించి రూ. 3,180 వద్ద ముగిసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)