వంటనూనె ధరలు మరింత ప్రియం?

Published on Fri, 10/25/2024 - 12:54

దేశీయంగా వంటనూనెల ధరలు మరింత పెరగబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. గత నెలలో ప్రభుత్వం వంట నూనులకు సంబంధించి దిగుమతి సుంకాలు పెంచడంతో రానున్న రోజుల్లో వీటి ధర మరింత పెరిగే అవకాశం ఉందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఈఏ) నివేదిక తెలిపింది.

ప్రభుత్వం గత నెలలో ముడి పామాయిల్‌, సోయాబీన్, నన్‌ఫ్లవర్‌ నూనెలపై దిగుమతి సుంకాలను 27.5 శాతం పెంచింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా వీటి ధరలు వరుసగా 10.6 శాతం, 16.8 శాతం, 12.3 శాతం అధికమయ్యాయి. దేశంలో దాదాపు 58 శాతం ముడి వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్నారు. రిటైల్ ధరలు సైతం అందుకు తదనుగుణంగా పెరుగుతున్నట్లు ఎన్‌ఈఏ నివేదించింది.

ఇదీ చదవండి: తస్మాత్‌ జాగ్రత్త! రియల్టీ సంస్థల నయా మోసం

సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈఏ) ప్రకారం..గురువారం నాటికి ముడి పామాయిల్‌, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెల బేస్‌ ధరలు వరుసగా 1145 డాలర్లు/టన్ను(రూ.96వేలు), 1160/టన్ను(రూ.97వేలు), 1165/టన్ను(రూ.98వేలు)గా ఉన్నాయి. ఇది గతంలో కంటే వరుసగా 32 శాతం, 18 శాతం, 26 శాతం పెరిగింది. దాంతో రానున్న రోజుల్లో వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. 2024 ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌ నెలలో 2.47 శాతం వంట నూనెల ధరల ద్రవ్యోల్బణం అధికమైంది. అయితే భారత్‌లో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న కారణంగా దేశీయ రైతులకు మేలు చేకూర్చే లక్ష్యంతోనే వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచినట్లు గతంలో ప్రభుత్వం తెలిపింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)