ప్రియుడి జీతంలో 80 శాతం ఫ్యామిలీకే ఖర్చు

Published on Wed, 09/23/2026 - 12:39

ఆధునిక సమాజంలో ఉద్యోగం, సంపాదన పెరిగినప్పటికీ వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ, కుటుంబ బాధ్యతల మధ్య సమతుల్యత లోపించడం చర్చనీయాంశమవుతోంది. ఇటీవల రెడ్డిట్‌ వేదికగా ఒక యువతి పంచుకున్న ఆర్థిక సమస్య సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీసింది. 

ఆసుపత్రిలో కన్సల్టెంట్‌గా పనిచేస్తూ నెలకు రూ.1.20 లక్షలు ఆర్జిస్తున్న తన ప్రియుడు అందులో రూ.1 లక్ష (ఏకంగా 83 శాతం) ప్రతి నెలా తన కుటుంబానికే పంపుతున్నాడని, చేతిలో కేవలం రూ.20,000 మాత్రమే ఉంచుకుంటున్నాడని సదరు యువతి ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో జీవిత భాగస్వాములుగా మారాలనుకునేవారికి ఈ తరహా ఆర్థిక వైఖరి ఎంతవరకు సమర్థనీయం అనే ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చింది.

ఆర్థిక నిపుణుల అభిప్రాయం

సాధారణంగా వ్యక్తిగత ఆర్థిక నియమాల ప్రకారం 50/30/20 ప్రాతిపదికన రాబడిని వర్గీకరించాలి. అంటే 50% అత్యవసర ఖర్చులకు, 30% వ్యక్తిగత ఆకాంక్షలకు, కనీసం 20% పొదుపు లేదా అత్యవసర నిధికి కేటాయించాలి. అయితే, ఆదాయంలో 83 శాతాన్ని ఒకే అవసరానికి కేటాయించడం వల్ల అత్యవసర వైద్యం, ఉద్యోగ భద్రత లేకపోవడం లేదా భవిష్యత్తు నిధి నిర్మాణానికి అవకాశం ఉండదు. స్వల్ప పరిమాణంలో మిగిలే రూ.20,000తో ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో సొంత ఖర్చులు వెళ్లదీయడం కష్టం.

నెటిజన్ల స్పందన

తల్లిదండ్రులను ఆదుకోవడం సంస్కారమే అయినా పెళ్లి లేదా దీర్ఘకాలిక బంధంలోకి అడుగుపెట్టేముందు ముందస్తు ఆర్థిక ప్రణాళిక ఎంతో కీలకమని నెటిజన్లు, నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జీవితాన్ని పంచుకోవాలనుకునే భాగస్వామితో మాట్లాడి కుటుంబ అవసరాలకు సరిపడా బడ్జెట్‌ను పునసమీక్షించుకోవడం బంధం నిలబడటానికి, ఆర్థిక స్థిరత్వానికి అవసరమని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: పరుగులు తీస్తున్న బంగారం ధరలు.. ఈరోజు రేటు ఎంతంటే..

Videos

ఖైరతాబాద్ టిక్కెట్ ఎవరికో..?

కాకుమాను రాజశేఖర్ కు YSRCP నేతలు సంతాపం

కదిలిన బడా గణేశ్

పాపం తమ్ముడు.. కారు అద్దం పగలకొట్టుకున్నాడు

చంద్రబాబుకైనా చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో పులివర్తి నాని అనుచరుల రౌడీయిజం

బూడిదైన ఇవ్వండి అంటే... ఇప్పుడు మీ బ్రతుకులు బూడిద పక్కా... సాయి కృష్ణ పిన్ని సంచలన కామెంట్స్

Watch Live: బాలాపూర్ లడ్డూ వేలం ప్రత్యక్షప్రసారం

నేను పోవాలని కొందరు... నన్ను కొన్నాళ్ళు బ్రతకనివ్వండి

DGPకి మెసేజ్ చేస్తే ఆయన ఇచ్చిన రిప్లై... సాయి కృష్ణ కేసులో అడ్వకేట్ సౌమ్య షాకింగ్ నిజాలు

మా అక్కకి చెప్పునా.. పిరికి పందలరా.. భయపడడం YSRCP బ్లడ్ లోనే లేదు

Photos

+5

ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర.. కనువిందు చేసే దృశ్యాలు

+5

‘ది ప్యారడైజ్’ మూవీ ట్రెండింగ్ లో హీరోయిన్‌ కయాదు లోహర్ (ఫొటోలు)

+5

ఫరియా అబ్దుల్లా ‘సిగ్మా’ సినిమా (ఫొటోలు)

+5

వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం (ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్రకు సర్వం సిద్ధం (ఫొటోలు)

+5

హీరోయిన్ రాధ ఇంట గణనాథునికి ప్రత్యేక పూజలు.. ఫోటోలు

+5

బీచ్‌లో దేవకన్యలా హీరోయిన్ శ్రీలీల పోజులు.. ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో హీరోయిన్ శృతిహాసన్ గ్లామర్.. ఫోటోలు

+5

విశాఖలో భారీ వర్షం... నేలకొరిగిన చెట్లు (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరో ప్రిన్స్ పెళ్లి రిసెప్షన్ (ఫొటోలు)