Breaking News

డీఆర్‌డీఓ డీ-4 డ్రోన్‌ టెక్నాలజీతో డ్రోన్ల దాడికి చెక్

Published on Fri, 07/02/2021 - 19:53

కొద్ది రోజుల క్రితం జమ్ము ఎయిర్‌బేస్‌పై డ్రోన్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే, భవిష్యత్ కాలంలో డ్రోన్ల ద్వారా దాడి ఎక్కువ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దాడులను తిప్పికొట్టేందుకు ఇజ్రాయిల్ తరహా "ఐరన్ డోమ్" వ్యవస్థ రూపొందించాలని దేశంలోని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ డ్రోన్ల దాడులను నివారించేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. డీ-4 యాంటీ డ్రోన్‌ వ్యవస్థ ద్వారా దేశంలోని కీలక రక్షణ కేంద్రాలను రక్షించుకోవచ్చు. 

డీఆర్‌డీఓలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్(ఈసీఎస్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ జిల్లెలమూడి మంజుల తెలిపిన వివరాల ప్రకారం.. "డీ-4 డ్రోన్‌ వ్యవస్థ ఆదివారం జమ్మూలో జరిగిన డ్రోన్ దాడులను ఇది గుర్తించగలదు. 4 కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను గుర్తించి వాటిపై దాడి చేస్తుంది. అత్యంత దుర్బల ప్రదేశాలపై దాడి చేసే అవకాశం ఉన్న రోగ్ డ్రోన్లను గుర్తించి నాశనం చేయడమే ఈ వ్యవస్థ లక్ష్యం. రోగ్ డ్రోన్లను నాశనం చేయడానికి ఈ వ్యవస్థలో  బహుళ సెన్సార్లు,  రెండు వేర్వేరు విధ్వంసకర పరికరాలు ఉన్నట్లు" ఆమె తెలిపారు.

డి-4 డ్రోన్ వ్యవస్థ ద్వారా శత్రు డ్రోన్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ జామ్ చేయడంతో పాటు, మైక్రో డ్రోన్ల హార్డ్ వేర్ నాశనం చేయగలదని డాక్టర్ మంజుల తెలిపారు. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఈ ఏడాది జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా భద్రత కోసం ఈ డి-4 డ్రోన్ వ్యవస్థను ఉపయోగించారు. డి-4 డ్రోన్‌ వ్యవస్థతో ప్రమాదకర డ్రోన్ల ఉనికిని త్వరగా గుర్తించి ధ్వంసం చేయడం ద్వారా వాటి దాడుల నుంచి ప్రముఖ ప్రాంతాలను రక్షించుకోవచ్చని ఆమె వివరించారు.

చదవండి: ఆకట్టుకుంటున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్

Videos

మురళీ ఎక్కడ ఉన్నావ్.. జగన్ సార్ వచ్చాడు సెల్యూట్ చెయ్

మురళీ నాయక్ కుటుంబానికి జగన్ ఆర్థిక సాయం..

Jawan Murali Naik Family: వైఎస్ జగన్ పరామర్శ

ఆపరేషన్ సిందూర్ లో ఎయిర్ ఫోర్స్ కీలక పాత్రపై ప్రధాని హర్షం

శ్రీకాకుళం జిల్లా కొరాఠి ఫీల్డ్ అసిస్టెంట్ పై కూటమి సర్కార్ కక్షసాధింపు

సుప్రీంలో MP మిథున్‌రెడ్డికి ఊరట

పహల్గాం దాడి అనుమానిత ఉగ్రవాది హతం

పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాదం నలుగురు మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

బాగేపల్లి టోల్ గేట్ వద్ద వైఎస్ జగన్ కు ఘనస్వాగతం

Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Photos

+5

ఏపీలో ప్రసిద్ధ వాడపల్లి.. 7 శనివారాల వెంకన్న ఆలయం.. మీరు ఎప్పుడైనా వెళ్ళారా (ఫొటోలు)

+5

ఖరీదైన ఇల్లు కొన్న 'అనసూయ'.. గృహ ప్రవేశం ఫోటోలు చూశారా?

+5

విజయవాడ : అన్నమాచార్యులు జయంతి సందర్భంగా.. నృత్య సమ్మోహనం (ఫొటోలు)

+5

Miss World 2025: నాగార్జున సాగర్‌ బుద్ధవనంలో ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)

+5

పెళ్లయి 13 ఏళ్లు.. భర్తతో హీరోయిన్ స్నేహ ఇలా (ఫొటోలు)

+5

గంగమ్మ జాతరలో మంచు మనోజ్ దంపతులు (ఫొటోలు)

+5

మదర్స్‌ డే స్పెషల్.. అమ్మలతో సెలబ్రిటీల పోజులు (ఫొటోలు)

+5

లండన్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహం.. తొలి నటుడిగా రికార్డ్ (ఫొటోలు)

+5

నందమూరి తారక రామారావు ఎంట్రీ సినిమా పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

తిరుపతి: గంగమ్మ జాతర.. మాతంగి వేషంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు (ఫొటోలు)