Breaking News

అమెరికా మార్కెట్లో కొత్తగా 30 ఔషధాలు

Published on Sat, 01/28/2023 - 06:35

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌) వచ్చే ఆర్థిక సంవత్సరం కీలకమైన అమెరికా మార్కెట్లో దాదా పు 30 కొత్త ఔషధాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ప్రస్తుతం సింగిల్‌ డిజిట్‌ స్థాయిలో వృద్ధి ఉన్నా వచ్చే అయిదు నుంచి ఏడేళ్లలో రెండంకెల స్థాయిలో సాధించగలమని ఇన్వెస్టర్లతో సమావేశంలో కంపెనీ సీఈవో ఎరెజ్‌ ఇజ్రేలీ తెలిపారు. ప్రస్తుతానికి ధరలపరమైన ఒత్తిళ్ల కారణంగా ఆదాయ వృద్ధి కొంత ఒడిదుడుకులకు లోను కావచ్చని పేర్కొన్నారు.

అటు చైనా మార్కె ట్లో తాము ఏటా రెండంకెల స్థాయిలో ఫైలింగ్స్‌ చేస్తున్నామని చెప్పారు. వచ్చే మూడు, నాలుగేళ్లలో 40,50 ఫైలింగ్స్‌ ఉండొచ్చని వివరించారు. సాధారణంగా ఉత్పత్తులకు అనుమతి లభించాలంటే .. దరఖాస్తు చేసుకున్న తర్వాత 18–24 నెలలు వరకు సమయం పడుతుందని ఇజ్రేలీ తెలిపారు. గతేడాది నాలుగు ఉత్పత్తులకు అనుమతి లభించిందని, ఈ ఏడాది కూడా దాదాపు అదే స్థాయిలో లేదా అంతకు మించి ఉండొచ్చని ఆశిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే డబుల్‌ డిజిట్‌ వృద్ధి సాధిస్తున్నామని.. వచ్చే, ఆపై ఆర్థిక సంవత్సరాల్లో ఇది ఇంకా మెరుగుపడగలదని పేర్కొన్నారు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)