Breaking News

డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం 1,342 కోట్లు

Published on Wed, 11/06/2024 - 05:27

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌) రూ. 1,342 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ2లో నమోదైన రూ. 1,480 కోట్లతో పోలిస్తే ఇది 9 శాతం తక్కువ. గ్లోబల్‌ జనరిక్స్‌ దన్నుతో సమీక్షాకాలంలో ఆదాయం రూ. 6,880 కోట్ల నుంచి సుమారు 17 శాతం వృద్ధి చెంది రూ. 8,016 కోట్లకు పెరిగినట్లు మంగళవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ తెలిపింది. 

వివిధ వ్యాపార విభాగాలవ్యాప్తంగా మెరుగైన వృద్ధిని కొనసాగించినట్లు సంస్థ కో–చైర్మన్‌ జీవీ ప్రసాద్‌ తెలిపారు. నికోటినెల్‌ తదితర బ్రాండ్ల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేశామని, భవిష్యత్‌ వృద్ధి చోదకాల విషయంలో పురోగతి సాధించామని ఆయన పేర్కొన్నారు. సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం, ప్రధాన వ్యాపారాలను బలోపేతం చేసుకోవడంపై మరింతగా దృష్టి పెట్టడాన్ని కొనసాగిస్తామని ప్రసాద్‌ వివరించారు. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవడం తదితర అంశాలపై ఈ ఆర్థిక సంవత్సరం రూ. 2,500 కోట్ల మూలధన వ్యయాలను చేయనున్నట్లు సంస్థ సీఈవో ఎరెజ్‌ ఇజ్రేలీ తెలిపారు.  

మరిన్ని విశేషాలు.. 
⇒ క్యూ2లో గ్లోబల్‌ జనరిక్స్‌ విభాగం ఆదాయం 17 శాతం పెరిగి రూ. 6,108 కోట్ల నుంచి సుమారు రూ. 7,158 కోట్లకు చేరింది. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్‌ 17 శాతం పెరిగి రూ. 3,728 కోట్లకు చేరింది. అమెరికాలో నాలుగు కొత్త ఉత్పత్తులను కంపెనీ ప్రవేశపెట్టింది. క్యూ2లో దేశీయంగా మూడు కొత్త బ్రాండ్లను కంపెనీ ప్రవేశపెట్టింది.  

⇒ రిటుగ్జిమాబ్‌ బయోసిమిలర్‌కి యూరోపియన్‌ కమిషన్‌ నుంచి మార్కెటింగ్‌ ఆథరైజేషన్‌ లభించింది. అలాగే, గ్యాస్ట్రోఇంటెస్టినల్‌ ఔషధం వొనొప్రాజాన్‌ను భారత్‌లో విక్రయించేందుకు టకెడా సంస్థతో లైసెన్సింగ్‌ ఒప్పందం కుదుర్చుకుంది.  కంపెనీ షేరు బీఎస్‌ఈలో స్వల్పంగా పెరిగి రూ. 1,273 వద్ద ముగిసింది.   
 

#

Tags : 1

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)